Viveka Murder Case | వివేకా హత్యకేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు!
Viveka Murder Case మే 5లోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశం!! విధాత: వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ మీదున్న ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే ఐదులోపు లొంగిపోవాలని, లేకుంటే అరెస్టు కు సిద్ధంగా ఉండాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని.. సాక్షులను బెదిరించడంతో బాటు, ఆధారాలను ధ్వంసం […]

Viveka Murder Case
- మే 5లోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశం!!
విధాత: వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ మీదున్న ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే ఐదులోపు లొంగిపోవాలని, లేకుంటే అరెస్టు కు సిద్ధంగా ఉండాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని.. సాక్షులను బెదిరించడంతో బాటు, ఆధారాలను ధ్వంసం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీత తోబాటు సీబీఐ సైతం గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయన బెయిల్ ను రద్దు చేసింది.
గంగిరెడ్డి బయట ఉండటం వల్ల భయంతో సాక్షులు, సమాచారం ఇచ్చేవాళ్ళు తమకు సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా దర్యాఫ్తు సమయాన్ని జూన్ 30 వరకూ పొడిగించడం, ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ కోరింది.