Vote | నిమ్మగడ్డకు ఓటొచ్చింది
Vote విధాత: ఎంతోమందికి ఆపరేషన్లు చేసిన పెద్ద డాక్టర్ తనకు తాను సర్జరీ చేసుకోలేకపోతాడు.. ఎన్నో తీర్పులు చెప్పిన పెద్ద జడ్జ్ తన కేసు విషయంలో తడబడతాడు.. ఎంతో మంది దొంగలను పట్టుకున్న పోలీసు తన ఇంట్లో పడిన దొంగను పట్టుకోలేకపోతాడు. అచ్చం అలాగే.. కోట్లాదిమంది ప్రజలకు ఓటు హక్కు కల్పించిన ఆ పెద్దాయన తనకు మాత్రం ఓటు తెచ్చుకోలేక పోయాడు. అవును రాష్ట్ర ఎన్నికల అధికారిగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రలో ఇన్నాళ్లకు […]

Vote
విధాత: ఎంతోమందికి ఆపరేషన్లు చేసిన పెద్ద డాక్టర్ తనకు తాను సర్జరీ చేసుకోలేకపోతాడు.. ఎన్నో తీర్పులు చెప్పిన పెద్ద జడ్జ్ తన కేసు విషయంలో తడబడతాడు.. ఎంతో మంది దొంగలను పట్టుకున్న
పోలీసు తన ఇంట్లో పడిన దొంగను పట్టుకోలేకపోతాడు. అచ్చం అలాగే.. కోట్లాదిమంది ప్రజలకు ఓటు హక్కు కల్పించిన ఆ పెద్దాయన తనకు మాత్రం ఓటు తెచ్చుకోలేక పోయాడు.
అవును రాష్ట్ర ఎన్నికల అధికారిగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రలో ఇన్నాళ్లకు ఓటు సంపాదించారు. సర్వీసులో ఉండగా ఓటు తెచ్చుకో లేని ఆయన రిటైర్ అయ్యాక.. కోర్టులో పోరాడి ఇప్పటికీ ఓటు హక్కు సాధించారు.
చంద్రబాబు హయాంలో నియమితులైన నిమగడ్డ రమేష్ కుమార్ ఆ తరువాత వచ్చిన జగన్ తో పెద్ద యుద్ధమే చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో పేచీలు పెట్టీ జగన్ను ఇబ్బంది పెట్టారు. మొత్తానికి అయిష్టంగా అయినా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు.
కొన్నేళ్లుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన ఓటు.. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో తిరస్కరణ కు గురైన సందర్భంగా ఆ ఓటుహక్కు పై కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు రమేష్ కుమార్ కు దుగ్గిరాల లో ఓటు హక్కు కల్పించాల ని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదే సమయంలో ఎలక్టోరల్ రిజిస్ర్టేషన్ అధికారి తన దరఖాస్తును అనుసరించి తన పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని న్యాయస్థానం కోరింది. రమేశ్ కుమార్ గ్రామంలో నివాసం లేరని పేర్కొంటూ అతని దరఖాస్తును దుగ్గిరాల తహసీల్దార్ అప్పట్లో తిరస్కరరించారు. దీంతో అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు అప్పీల్ దాఖలు చేశారు.
అయినా కుదరకపోవడంతో రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో… మంగళగిరి నియోజకవర్గం లోని దుగ్గిరాల గ్రామానికి చెందిన రమేశ్ కుమార్… హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం ఉంటున్నారని అక్కడ ఓటర్ల జాబితా లో పేరు నమోదు చేసుకున్నారని, అందుకే ఏపీలో ఓటు ఇవ్వడం కుదరదు అని ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.
అయితే హైదరాబాద్ లో తన ఓటును రద్దు చేసుకున్నానని.. తాజాగా గుంటూరు జిల్లాలో నమోదుకు దరఖాస్తు చేసుకున్నానని.. అయినా తన దరఖాస్తు తిరస్కరించారని రమేష్ కుమార్ కోర్టుకు వివరించగా ఇక ఆయనకు ఓటు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మొత్తానికి ఇన్నాళ్లకు పోరాడి ఓటును సాధించుకున్నారు.