Warangal | ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ముగ్గురి పరిస్థితి విషమం

Warangal మంగపేట మండల కేంద్రంలో సంఘటన బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు ఏటూరునాగారం హాస్పిటల్‌కు తరలింపు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాం నగర్ గోత్తికోయ గూడెంకు చెందిన మడవి […]

Warangal | ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ముగ్గురి పరిస్థితి విషమం

Warangal

  • మంగపేట మండల కేంద్రంలో సంఘటన
  • బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు
  • ఏటూరునాగారం హాస్పిటల్‌కు తరలింపు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాం నగర్ గోత్తికోయ గూడెంకు చెందిన మడవి సురేష్ , చిన్నారి దంపతులు, కుమారుడు మడవి నవీన్, కుమార్తె మడవి ఇలాషా తో మంగపేట గవర్నమెంట్ ఆసుపత్రి వైపు నుంచి బైక్ పై వస్తుండగా మంగపేట బస్టాండ్ నుండి హన్మకొండకు వెళుతున్న బస్సు తెలంగాణ సెంటర్ లో ఢీ కొంది.

ఈ ప్రమాదంలో మడవి సురేష్, చిన్నారి దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు బైక్ నుంచి కిందపడ్డారు. ప్రమాదం గమనించిన స్థానికులు 108 కి, మంగపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడ నుండి ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మడవి నవీన్, మడవి సురేష్, మడవి చిన్నారిల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.