Warangal | వరంగల్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
Warangal నష్టం వివరాలను పరిశీలించిన కేంద్ర బృందం రెండు రోజులు జిల్లావరంగల్ జిల్లా కేంద్ర బృందం పర్యటన నష్టం వివరాలను పరిశీలించిన కేంద్ర బృందం రెండు రోజులు జిల్లాలో కేంద్ర బృంద పర్యటన నష్టం వివరాలు తెలియజేసిన కలెక్టర్లు రేపు మోరంచ, కొండాయిలలో పరిశీలన బృందం రాక పట్ల ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లాలో కేంద్రఅధికారుల బృందం మంగళవారం పర్యటించి, వరద నష్టం వివరాలను పరిశీలించింది. వివిధ శాఖలకు […]

Warangal
- నష్టం వివరాలను పరిశీలించిన కేంద్ర బృందం
- రెండు రోజులు జిల్లావరంగల్ జిల్లా కేంద్ర బృందం పర్యటన
- నష్టం వివరాలను పరిశీలించిన కేంద్ర బృందం
- రెండు రోజులు జిల్లాలో కేంద్ర బృంద పర్యటన
- నష్టం వివరాలు తెలియజేసిన కలెక్టర్లు
- రేపు మోరంచ, కొండాయిలలో పరిశీలన
- బృందం రాక పట్ల ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లాలో కేంద్రఅధికారుల బృందం మంగళవారం పర్యటించి, వరద నష్టం వివరాలను పరిశీలించింది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. రెండు రోజులపాటు ఈ బృందం వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, మోరంచ, కొండాయి తదితర ప్రాంతాలలో పర్యటించి నష్టం అంచనాలను రూపొందించనున్నారు. అనంతరం బృందం వరద నష్టానికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నది.
ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన
మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకున్న కేంద్ర బృందానికి వర్షాలు, వరద నష్టం వివరాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూపెట్టారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలలో బృందం పర్యటించింది. జవహర్ నగర్, భద్రకాళి, పోతననగర్ తదితర ప్రాంతాలను పర్యటించారు. వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ భాషా నష్టం వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.
ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రాక
ఏడుగురు సభ్యుల కేంద్ర బృందంలో ఎన్‌డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్), డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ ఆర్ ఎస్సి డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే ఉన్నారు.
ఈ బృందం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు,రహదారుల తో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు పర్యటించారు. జులై 18 నుండి 27 వ తేదీ వరకు 600 ఎంఎం వర్షం కురిసిందని కేంద్ర బృందానికి కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా వివరించారు.
వరంగల్ మహానగరంలో వరదల వల్ల 150.61 కిలోమీటర్ల సిసి రోడ్డుకు రూ110.71 కోట్ల దెబ్బతిన్నదని, 82.73 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ. 92.94 కోట్ల నష్టం వాటిల్లినదని, 84.56 కిలోమీటర్ల రూ 43.55 కోట్ల మెటల్ రోడ్డు దెబ్బ తిన్నదని, 75.23 కిలోమీటర్ల 9.37 కోట్ల రూపాయల గ్రావెల్ రోడ్స్ లకు, 128 కిలోమీటర్ల 63.9 కోట్ల రూపాయల మురుగు కాలువలు దెబ్బ తిన్నాయని, 71 కల్వర్టులకు 52.41 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, 41.3 కిలోమీటర్ల మంచినీటి సరఫరా పైప్ లైన్ లకు 25 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కమిషనర్ వివరించారు.
బాధితులను ఆదుకునేందుకు చర్యలు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భారీ వర్షాల వరద బాధితులు 535 కంప్లైంట్స్ రాగా 5 రెస్పాన్స్ టీం ల ద్వారా వారిని రక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందని, నగరంలో 199 కాలనీలు పాక్షికంగా నీటిలో మునగగా క్లియర్ చేయడం జరిగిందని, పడిపోయిన 32 వృక్షాలను తొలగించడం జరిగిందన్నారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ద్వారా 27 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 3500 వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి భోజన సదుపాయం కల్పించమన్నారు.
బుధవారం మోరంచ కొండాయి ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది కాగా బృందం రాకపట్ల రాష్ట్ర ప్రభుత్వంగానీ, ప్రజాప్రతినిధులు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, నీటి పారుదల శాఖ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆర్ అండ్ బి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.