Warangal | ఎస్‌ఆర్ ప్రైమ్ కాలేజీలో ఫుడ్‌పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

Warangal 23 మంది హాస్పిటల్లో అడ్మిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని భట్టుపల్లిలో ఉన్న ఎస్ ఆర్ ప్రైమ్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇందులో 23 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంబంధిత కళాశాల నిర్వాహకులు ఆదివారం విద్యార్థులకు చికెన్ తో భోజనం పెట్టినట్లు చెబుతున్నారు. […]

Warangal | ఎస్‌ఆర్ ప్రైమ్ కాలేజీలో ఫుడ్‌పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

Warangal

  • 23 మంది హాస్పిటల్లో అడ్మిట్
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని భట్టుపల్లిలో ఉన్న ఎస్ ఆర్ ప్రైమ్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇందులో 23 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సంబంధిత కళాశాల నిర్వాహకులు ఆదివారం విద్యార్థులకు చికెన్ తో భోజనం పెట్టినట్లు చెబుతున్నారు. చికెన్తో అన్నం తిన్న విద్యార్థుల్లో సాయంత్రం సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యాయి. ఇందులో 23 మందిని మాత్రం కళాశాల నిర్వాహకులు కాజీపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పేరెంట్స్ హాస్పిటల్ కు వెళ్తే ఆస్పత్రి నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కళాశాల నిర్వాహకులు హాస్పిటల్ యాజమాన్య తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై కాలేజీ యజమాన్యం నోరు మెదపడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు జోక్యం చేసుకుంటే వివరాలు తెలిసే అవకాశం ఉంది.