Warangal | భూ తగాదాలు.. తమ్మున్ని హత్య చేసిన అన్న
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉర్సు వేంకటేశ్వర హై స్కూల్ ప్రాంతంలో తమ్ముని అన్న హత్య చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. తమ్ముడు శ్రీకాంత్ ను ఇంటికి పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించినప్పటికీ చనిపోకపోవడంతో తలపై బండరాయితో కొట్టి సొంత అన్న చంపినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు భూ పంచాయితీ కారణం అంటూ మృతురాలి భార్య రోదిస్తున్నది. శ్రీకాంత్ ను చంపేందుకు అన్న గతంలో […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉర్సు వేంకటేశ్వర హై స్కూల్ ప్రాంతంలో తమ్ముని అన్న హత్య చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.
తమ్ముడు శ్రీకాంత్ ను ఇంటికి పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించినప్పటికీ చనిపోకపోవడంతో తలపై బండరాయితో కొట్టి సొంత అన్న చంపినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ హత్యకు భూ పంచాయితీ కారణం అంటూ మృతురాలి భార్య రోదిస్తున్నది. శ్రీకాంత్ ను చంపేందుకు అన్న గతంలో కూడా హత్య ప్రయత్నం చేశాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.