Warangal | వరదనీటిని పరిశీలించిన మంత్రి సత్యవతి
Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. స్థానికులు, వాహనదారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి […]

Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. స్థానికులు, వాహనదారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా మంత్రి సూచించారు. రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలను కోరారు.