Warangal | భగీరథతో నీటి కష్టాలకు పరిష్కారం: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
Warangal నూరు శాతం గృహాలకు నల్లానీరు శుద్ధమైన మంచినీరు అందిస్తున్న ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను నిర్మూలించాం రాష్ట్ర మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోకెల్లా […]

Warangal
- నూరు శాతం గృహాలకు నల్లానీరు
- శుద్ధమైన మంచినీరు అందిస్తున్న ప్రభుత్వం
- ఫ్లోరైడ్ సమస్యను నిర్మూలించాం
- రాష్ట్ర మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం సమీపంలో ఉన్నట్టి పాలేరు వరంగల్ సెగ్మెంట్ మిషన్ భగీరథ ప్రాజెక్టును మంచినీటి పండుగ వేడుకల సందర్భంగా ఆదివారం మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు.
కృష్ణా జలాలు ఇక్కడకు పంపింగ్ చేసుకొని, స్టోర్ చేసిన వాటర్‌ను శాస్త్రీయ పద్ధతి, ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా శుద్ధి చేస్తారని వివరించారు. ఆ నీటిని అధిక సామర్ధ్యం గల ప్రత్యేక మోటార్ల వినియోగించి 1000 mm పైప్ లైన్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
సుమారు 85 కిలో మీటర్ల దూరంలో ఉన్న నర్సంపేట నియోజకవర్గానికి తరలిస్తారని చెప్పారు. అక్కడి నుండి ఇంటర్నల్ ఫిల్టర్ బెడ్స్ ద్వారా నర్సంపేట పట్టణంతో పాటు చుట్టూ ఉన్న మొత్తం 179 గ్రామాలకు ప్రతీరోజు శుద్దిచేసిన నీటిని అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 2018వ సంవత్సరం నుండి ప్రజలకు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందుతుందని వివరించారు. గతంలో మంచినీరు లేక కలుషిత నీరు తాగి ప్రజలు అనేక అవస్థల పాలయ్యేవారని తెలంగాణ రాష్ట్ర అనంతరం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తూ మహిళల కష్టాలను తీరుస్తున్నామని వివరించారు.
కార్యక్రమంలో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, వరంగల్ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నతో పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.