Warangal | లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్ద‌రి అరెస్టు.. రూ.25 లక్షల యంత్రాలు స్వాధీనం

Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనుమతులు లేకుండా అర్హత లేని వ్యక్తులకు లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేయూసి మరియు దామెర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి సూమారు 25 లక్షల రూపాయల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మల్లివుడి అశోక్ కుమార్, తండ్రిపేరు రాజారావు, వయస్సు 34, విజయవాడ, తాతపూడి కిరణ్ కుమార్, […]

  • Publish Date - June 10, 2023 / 01:11 PM IST

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనుమతులు లేకుండా అర్హత లేని వ్యక్తులకు లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేయూసి మరియు దామెర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి సూమారు 25 లక్షల రూపాయల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో మల్లివుడి అశోక్ కుమార్, తండ్రిపేరు రాజారావు, వయస్సు 34, విజయవాడ, తాతపూడి కిరణ్ కుమార్, తండ్రి పేరు బెంజిమన్, వయస్సు 29, కావలి, నెల్లూరు జిల్లా. ఆంధ్ర‌ప్రదేశ్‌కు చెందిన వారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలిపారు.