దళిత మహిళ తాకిందని.. నీళ్ల ట్యాంక్‌ను మూత్రంతో శుభ్రం చేశారు!
విధాత: కులాధిక్యత శృతిమించి వికృత పోకడలు పోతున్నది. సాటి మనిషిని అశుధ్దం కన్నా హీనం చేస్తున్నది. మనిషి తాకటంతో మలినమై పోయిందని, ఆవు మూత్రంతో శుభ్రం చేసుకున్నారు! కర్నాటక మైసూర్ జిల్లాలోని హెగ్గతార గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఓ దళిత కుటుంబంలో మొన్న పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి దూరపు బంధువుగా వచ్చిన ఒక మహిళ దాహం వేస్తే ఆ ఊరు ఆచార వ్యవహారాలు తెలియక అక్కడ ఉన్న నీటి ట్యాంక్ […]

విధాత: కులాధిక్యత శృతిమించి వికృత పోకడలు పోతున్నది. సాటి మనిషిని అశుధ్దం కన్నా హీనం చేస్తున్నది. మనిషి తాకటంతో మలినమై పోయిందని, ఆవు మూత్రంతో శుభ్రం చేసుకున్నారు! కర్నాటక మైసూర్ జిల్లాలోని హెగ్గతార గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగింది. వివరాళ్లోకి వెళితే..
ఓ దళిత కుటుంబంలో మొన్న పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి దూరపు బంధువుగా వచ్చిన ఒక మహిళ దాహం వేస్తే ఆ ఊరు ఆచార వ్యవహారాలు తెలియక అక్కడ ఉన్న నీటి ట్యాంక్ దగ్గర మంచి నీళ్లు తాగింది. దాన్ని చూసిన ఆ ఊరి పెద్ద ఒకాయన ఆ మహిళ చర్యను తీవ్రంగా పరిగణించాడు.
అంతే ఊరి జనాన్ని పోగేసి పంచాయితీ పెట్టాడు. అంతటితో ఆగకుండా దళిత మహిళ తాకటంతో నీటి ట్యాంకు మలినమై పోయిందని ట్యాంకు నుంచి నీరంతా తోడి పారపోశారు. ఆ ట్యాంకును పరిశుద్ధం చేయటం కోసం గోవు మూత్రంతో కడిగారు. మనిషి తాకిన మలినాన్ని ఆవు మూత్రంతో శుభ్రం చేసుకున్నారన్నమాట!