ఎన్టీఆర్ మాకు అవసరం లేదు.. విజయవాడలో పోస్టర్ల కలకలం

విధాత‌, విజ‌య‌వాడ‌: ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. హెల్త్ యూనివర్శిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరిరోజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో ఆరంభమైన ఈ వివాదం ఇప్పటికీ సద్దుమణగట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి. టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా […]

ఎన్టీఆర్ మాకు అవసరం లేదు.. విజయవాడలో పోస్టర్ల కలకలం

విధాత‌, విజ‌య‌వాడ‌: ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. హెల్త్ యూనివర్శిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరిరోజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో ఆరంభమైన ఈ వివాదం ఇప్పటికీ సద్దుమణగట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి. టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా విజయవాడలో కొత్తగా పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తున్నాయి. విజయవాడలో చంద్రబాబుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు..ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చెప్పినట్లుగా డెక్కన్ క్రానికల్ కథనం రాసింది. దీనికి సంబంధించిన క్లిప్ లు విజయవాడలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి.

విజయవాడలో రమేష్ హాస్పిటల్స్, బెంజ్ సర్కిల్, సిద్ధార్థ్ కాలేజీ, సత్యనారాయణపురం, గన్నవరం, కృష్ణలంక, పటమట, అజిత్‌సింగ్ నగర్, విద్యాధరపురం, గవర్నరు పేట.. వంటి పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఇవి ఎవరు అంటించారనే దానిపై క్లారిటీ లేదు. కాని అవి మాత్రం వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం విజయవాడలో దసరా పండగ కోలాహలం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు విజయవాడకు చేరుకోవడం ఒకట్రెండు రోజుల్లో ఆరంభమౌతుంది. ఇలాంటి వాతావరణంలో బాబు: వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్.. అనే పోస్టర్లు నగరవ్యాప్తంగా కనిపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వారు ఆసక్తిగా వాటిని తిలకిస్తోన్నారు.