మాకొద్దు.. ఈ ఫార్మా కంపెనీలు.. కిష్టాపురం వాసుల ఆందోళన

విధాత: మా నీళ్లను.. మా పంటలను కలుషితం చేస్తూ.. చివరికి మా బతుకులను నాశనం చేసే కాలుష్యం మహమ్మారి ఫార్మా కంపెనీలు మాకొద్దంటూ మునుగోడు నియోజకవర్గం కిష్టాపురం వాసులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఈప్రాంతంలో ఉన్న పాత కంపెనీలకు తోడు కొత్తగా మరో కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే సన్ లైట్ ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ల […]

మాకొద్దు.. ఈ ఫార్మా కంపెనీలు.. కిష్టాపురం వాసుల ఆందోళన

విధాత: మా నీళ్లను.. మా పంటలను కలుషితం చేస్తూ.. చివరికి మా బతుకులను నాశనం చేసే కాలుష్యం మహమ్మారి ఫార్మా కంపెనీలు మాకొద్దంటూ మునుగోడు నియోజకవర్గం కిష్టాపురం వాసులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఈప్రాంతంలో ఉన్న పాత కంపెనీలకు తోడు కొత్తగా మరో కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే సన్ లైట్ ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మునుగోడు ప్రాంత ప్రజలు ఇప్పటికే భూగర్భంలోని ఫ్లోరైడ్‌తో అనేక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం తాగు సాగునీటి వసతుల విస్తరణకు చెక్ డ్యాములు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ప్రాజెక్టుల నిర్మాణలతో ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకు విరుద్ధంగా మరోవైపు ఫార్మా కంపెనీల ఏర్పాటుతో వాటి నుండి వచ్చే వ్యర్ధ రసాయనాలు ఈ ప్రాంతాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉందన్నారు.

వాయు, జల కాలుష్యంతో పంటలు దెబ్బతింటాయని, ప్రజలు, పశు పక్షాదులు రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే ఉన్న ఫార్మా కంపెనీలను తరలించడంతోపాటు కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వరాదన్న డిమాండ్ ఈ ప్రాంత ప్రజలు చేస్తున్నారన్నారు. ప్రజల ఆందోళన అర్థం చేసుకొని ఫార్మా కంపెనీ అనుమతి రద్దు చేసుకోవాలన్నారు.

ఇటీవల గట్టుప్పల్ ఫార్మా కంపెనీకి జిల్లా యంత్రాంగం ఇచ్చిన అనుమతులు రద్దు చేసుకున్న నేపథ్యంలో తమ గ్రామంలో కూడా ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేసుకోవాలని కిష్టాపురం గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆందోళ‌న‌లో మాజీ జెడ్పిటిసి జాజుల అంజయ్య గౌడ్, కిష్టాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.