CM Revanth Reddy| మేం వ్యవసాయాన్ని పండగ చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 18నెలలో రైతుల కోసం లక్ష నాలుగువేల కోట్లు ఖర్చు చేసి రైతులకు 2లక్షల రుణమాఫీ, రైతు భరోసా, బీమా పథకాలు అమలు చేస్తునే.. డ్రిప్పు, సోలార్ పంపసెట్ల నుంచి ధాన్యం కొనుగోలు వరకు సబ్సీడీలు అందిస్తూ వ్యవసాయాన్ని పండగ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 70లక్షల కుటుంబాలకు కోటి 40లక్షల ఎకరాలకు..9వేలకోట్ల రైతు భరోసా జమ చేశామన్నారు.రైతుభరోసా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ క్యాన్సర్ మాదిరిగా మార్చారని..రూ.8లక్షల 29వేల కోట్ల అప్పలను కాంగ్రెస్ సర్కార్ పై మోపారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు సాగునీళ్లు అందిస్తామంటూ కట్టిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలేశ్వరమైందన్నారు. పదేళ్లలో కల్వకుర్తి, పాలమూరు, బీమా, సీతారామం సహా ఏ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరంలో కూలేశ్వరమై లక్ష కోట్ల అవినీతి జరిగిందని..భూములు అమ్ముకున్నారని.. ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టారున్నారు. కాంట్రాక్టర్లకు 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు గాని..ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులు, యువత ఆర్థికంగా చితికిపోగా..కేసీఆర్ కు మాత్రం గజ్వేల్ లో 100 ఎకరాల ఫామ్ హౌజ్ ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో అగర్బ శ్రీమంతులుగా..నిజాం అమీర్ లుగా మీరు మారిపోయారన్నారు. ఉద్యోగాల కోసం ఆనాడు విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో రోడ్డు ఎక్కారని.. ఇవాళ మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎల్బీ స్టేడియంలో 60 వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలిచ్చామన్నారు. ఏడాదిలో మేం ఇచ్చిన ఉద్యోగాలు.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పాలన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ప్రతిపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయి ఆయనను ఇంటికి పంపించారని..ఆ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరన్నారు.
అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై చర్చకు సవాల్
చంద్రబాబుతో 299టీఎంసీలు చాలు మీరు 512టీఎంసీలు తీసుకుని తెలంగాణకు కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణం చేశారని చేశారని రేవంత్ రెడ్డివ విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను కట్టారని..బనకచర్ల బాట వేశారని..ఇప్పుడు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ చర్చకు రమ్మంటే ముఖం చెల్లక నీవు అల్లుడు హరీష్ రావును అంబోతులా వదిలావని రేవంత రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వదిలేసిన తుమ్మిడిహట్టి సహా అన్ని ప్రాజెక్టులు కడుతామన్నారు. గోదావరి జలాలు, కృష్ణ జలాల మీద అసెంబ్లీలో చర్చ పెడుదాం రావాలని..రాయలసీమను రతనాల సీమను మారుస్తామన్నదెవరో చర్చకు రావాలని నేను సవాల్ విసురుతున్నాననన్నారు. బనకచర్లపై అసెంబ్లీ చర్చకు సిద్దమని నీకు, నీ అల్లుడికి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. అప్పుడు తెలంగాణ ద్రోహులెవరో..గోదావరి జలాల దొంగల్లెవరో తేలుద్దామని సవాల్ విసిరారు. రైతుల కోసం ఎంతవరకైన పోరాడుతామని..రైతులను కాదన్న వారు రాక్షసులుగా మిగిలిపోతారన్నారు. 1994నుంచి 2004 వరకు టీడీపీ, 2004నుంచి 2014వరకు కాంగ్రెస్, 2014నుంచి 2023వరకు బీఆర్ఎస్, 2023నుంచి 2033వరకు మళ్లీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని..రైతుల సంక్షేమానికి మేం ఈ పదేళ్లు మేం అండగా ఉంటామని..మీరు మా పార్టీకి అండగా ఉండాలని కోరారు.