సున్నిత ప్రాంతాల్లో తగిన భద్రత కల్పిస్తాం: DGP
పీసీసీఎఫ్ డోబ్రియాల్ కు డీజీపీ హామీ విధాత: అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సున్నిత ప్రాంతాల్లో అటవీ సిబ్బందికి తగిన భద్రత కల్పిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి పీసీసీఎఫ్ డోబ్రియాల్‌కు హామీ ఇచ్చారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురువారం పీసీసీఎఫ్ డోబ్రియాల్ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి విధులు నిర్వర్తిస్తున్నఅటవీ సిబ్బందికి భద్రత కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నఅటవీ సిబ్బంది పోలీస్ శాఖతో మరింత సమన్వయంతో పని […]

- పీసీసీఎఫ్ డోబ్రియాల్ కు డీజీపీ హామీ
విధాత: అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సున్నిత ప్రాంతాల్లో అటవీ సిబ్బందికి తగిన భద్రత కల్పిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి పీసీసీఎఫ్ డోబ్రియాల్‌కు హామీ ఇచ్చారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గురువారం పీసీసీఎఫ్ డోబ్రియాల్ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి విధులు నిర్వర్తిస్తున్నఅటవీ సిబ్బందికి భద్రత కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నఅటవీ సిబ్బంది పోలీస్ శాఖతో మరింత సమన్వయంతో పని చేయాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో తగిన భద్రత కల్పించాలని అటవీశాఖ చీఫ్ కోరారు.
భద్రత కల్పించడానికి హామీ ఇచ్చిన డీజీపీ తమ సిబ్బందికి తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. అంతకు ముందు పీసీసీఎఫ్ డోబ్రియాల్ అటవీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మీ ప్రతిపాదనలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీనిచ్చారు.