VRAల పోరాటానికి అండ‌గా ఉంటాం: రేవంత్ రెడ్డి

విధాత‌: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 75 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ తహశీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ఆందోళనకు రేవంత్ సంఘీభావం తెలిపారు. వినతిపత్రం ఇస్తే వీఆర్ఏల ముఖంపై విసిరికొట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. అనంత‌రం వీఆర్ఏలు తమ సమస్యలపై రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేసీఆర్..తగిన మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు. పార్టీ […]

VRAల పోరాటానికి అండ‌గా ఉంటాం: రేవంత్ రెడ్డి

విధాత‌: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 75 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ తహశీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ఆందోళనకు రేవంత్ సంఘీభావం తెలిపారు. వినతిపత్రం ఇస్తే వీఆర్ఏల ముఖంపై విసిరికొట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.

అనంత‌రం వీఆర్ఏలు తమ సమస్యలపై రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేసీఆర్..తగిన మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు. పార్టీ తరఫున వీఆర్ఏల పోరాటానికి అండగా ఉంటామని.. వారి డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.