రీల్‌లో కాదు రియల్ లైఫ్‌లోనే..! ఆసుపత్రి వార్డులో వధువు మెడలో తాళికట్టిన వరుడు..!
Wedding in Hospital | పెళ్లి అనేది జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, ఎవరైనా పచ్చని పెళ్లి పందిరిలో బంధువుల సమక్షంలో ఒక్కటి కావాలనుకుంటారు. కానీ, చిత్రంలో ఓ జంట పెళ్లికి మాత్రం ఆసుపత్రి వేదికైంది. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురికావడంతో ఈ పెళ్లి దవాఖానలో నిర్వహించాల్సి వచ్చింది. ఈ వార్త చదివితే మీకు బాలీవుడ్‌లో జరిగిన ‘వివాహ్’ సినిమా గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ, ఇది రియల్ లైఫ్‌లోనూ జరిగిదండోయ్..! వివరాల్లోకి వెళితే.. […]

Wedding in Hospital | పెళ్లి అనేది జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, ఎవరైనా పచ్చని పెళ్లి పందిరిలో బంధువుల సమక్షంలో ఒక్కటి కావాలనుకుంటారు. కానీ, చిత్రంలో ఓ జంట పెళ్లికి మాత్రం ఆసుపత్రి వేదికైంది. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురికావడంతో ఈ పెళ్లి దవాఖానలో నిర్వహించాల్సి వచ్చింది.
ఈ వార్త చదివితే మీకు బాలీవుడ్‌లో జరిగిన ‘వివాహ్’ సినిమా గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ, ఇది రియల్ లైఫ్‌లోనూ జరిగిదండోయ్..! వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కోటాలోని కోటా జిల్లాలోని రామ్‌గంజ్ మండి ప్రాంతంలోని భావ్‌పురా నివాసి పంకజ్‌కు రావత్‌భటా నివాసి మధు రాథోడ్‌తో పెళ్లి నిశ్చయమైంది. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇటు వధువు, వరుడి ఇంట్లో పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే వధువు ఇంట్లో మెట్లపై నుంచి జారి పడింది. దీంతో రెండు చేతులు విరగడంతో పాటు తలకు కొద్దిగా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు వధువును ఎస్‌బీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతుంది. అయితే, వధువు గాయపడిన సమాచారం చెప్పే లోపే పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి కోసం మండపానికి బయలుదేరింది.
ఆ తర్వాత విషయం తెలియడంతో ఆసుపత్రికి చేరుకున్నారు. పంకజ్, మధు తండ్రులు శివలాల్ రాథోడ్, రమేశ్ రాథోడ్ పెళ్లి విషయంపై చర్చించారు. ఆ తర్వాత ఆసుపత్రిలోనే పెళ్లి వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం హాస్పిటల్‌లో ఓ గదిని బుక్ చేసి, అందంగా అలంకరించి.. వివాహాన్ని జరిపించారు.
వధూవరులిద్దరు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు ఆ తర్వాత మధు మెడలో పంకజ్ తాళి కట్టాడు. మధు నడువలేని స్థితిలో ఉండడంతో ఏడడుగులు మాత్రం నడవలేకపోయారు. ఈ ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.