బైక్‌పై స్టంట్ చేస్తు.. ప్రీ వెడ్డింగ్ షూట్ (వీడియో వైరల్)
విధాత: వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. గతంలో ఎన్నో సార్లు వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చూశాం. ఓ జంట పొలం పనులు చేస్తూ ఫోటోలు దిగితే..మరో జంట కేవలం దుప్పట్లు కప్పుకుని ఫోటోలు దిగి అప్పట్లో పెద్ద హడావుడే చేసింది సోషల్ మీడియాలో. ఆ తరవాత ఎన్నో జంటలు ఆ ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్యాకేజ్‌ల లెక్కన భారీ మొత్తంలో వసూలు చేస్తూ అందమైన ఫోటోలను తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. […]

విధాత: వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. గతంలో ఎన్నో సార్లు వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చూశాం. ఓ జంట పొలం పనులు చేస్తూ ఫోటోలు దిగితే..మరో జంట కేవలం దుప్పట్లు కప్పుకుని ఫోటోలు దిగి అప్పట్లో పెద్ద హడావుడే చేసింది సోషల్ మీడియాలో. ఆ తరవాత ఎన్నో జంటలు ఆ ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్యాకేజ్‌ల లెక్కన భారీ మొత్తంలో వసూలు చేస్తూ అందమైన ఫోటోలను తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు.
ఆనందమైన క్షణాల్ని ఫోటోల్లో దాచుకోవాలనుకునే వారంతా ఈ ప్యాకేజ్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా సరే… ఫోటోలు, వీడియోలు చాలా రిచ్‌గా రావాలని కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. అలాంటి ఫోటో షూట్‌లు వైరల్ అవుతూనే ఉంటాయి. సంగీత్, హల్దీ ఈవెంట్స్‌ను కూడా గ్రాండ్‌గా చేస్తున్నారు.
అయితే…ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్‌ని గ్రాండ్‌గానే కాకుండా సినిమా రేంజ్‌లో చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల వ్యూస్, వేల కామెంట్లు వెళ్లు వెత్తుతున్నాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ జంట బైక్‌పై కూర్చుంది. ఫోటో షూట్ కోసం అరేంజ్ చేసుకున్నారులే అనుకుంటాం.
కానీ.. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు ఫోటోగ్రాఫర్. ఓ క్రేన్‌తో ఆ బైక్‌ను గాల్లోకి లేపాడు. అలాగే ముందుకు లాక్కెళ్లాడు. ముందు నుంచి ఫోటోలు, వీడియోలు తీశారు. చూడటానికి ఇదేదో యాక్షన్ మూవీ స్టంట్‌లా ఉంది. కేవలం 13 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్లి కొడుకు స్టంట్ డైరెక్టర్ అనుకుంటా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.