ఇక మెదక్‌లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతా: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.

విధాత, మెదక్ బ్యూరో: తాను మెదక్, రామాయంపేట, ఎమ్మెల్యేగా గెలువక ముందే ఆ నియోజకవర్గాలలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టానని అప్పుడు మిగిలిపోయిన కార్యక్రమాల్ని డాక్టర్ మైనంపల్లి రోహిత్ నేతృత్వంలో చేపడుతామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షను విరమించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల కనకదుర్గ అమ్మవారిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు, మైనంపల్లి రోహిత్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు ఆలయ కమిటీ […]

  • By: krs    latest    Feb 19, 2023 7:14 AM IST
ఇక మెదక్‌లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతా: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.

విధాత, మెదక్ బ్యూరో: తాను మెదక్, రామాయంపేట, ఎమ్మెల్యేగా గెలువక ముందే ఆ నియోజకవర్గాలలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టానని అప్పుడు మిగిలిపోయిన కార్యక్రమాల్ని డాక్టర్ మైనంపల్లి రోహిత్ నేతృత్వంలో చేపడుతామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు.

శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షను విరమించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల కనకదుర్గ అమ్మవారిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు, మైనంపల్లి రోహిత్‌తో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు ఆలయ కమిటీ చైర్మన్ బాలగౌడ్, ఈవో సార శ్రీనివాస్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ..

మెదక్ నియోజకవర్గంలో గతంలో ఉన్న సంబంధాలతో ఇక్కడికి రావడం జరిగిందని, ఇక్కడ కూడా సోషల్ యాక్టివిటీస్ చేపట్టాలని కార్యకర్తలు కోరడంతో ఈరోజు నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని పాఠశాలల్లో బాలబాలికలకు వేరువేరుగా ఒక మోడల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే ప్రతి మండలంలో కూడా ఒక పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ నియోజకవర్గంలో గతంలో చేయని కార్యక్రమాలను రోహిత్ బాధ్యతలు తీసుకొని 3,4 నెలలో అనేక సాంఘిక కార్యక్రమాలు చేపడుతాడని తెలిపారు.

ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో నక్క ప్రభాకర్ గౌడ్, సురేందర్ గౌడ్, మార్కెట్ బీఅర్యస్ మండల మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.