నాగచైతన్య.. పరశురామ్‌ల ‘నాగేశ్వరరావు’ ఏమైంది..?

విధాత: గీతా గోవిందం చిత్రంతో పరశురాం స్టార్ డైరెక్టర్ అయిపోయారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో పరశురాం తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయడం కోసం కథను సిద్ధం చేశారు. నాగేశ్వరరావు అనే వర్కింగ్ టైటిల్‌ని కూడా పెట్టుకున్నారు. ఇంతలోనే పరశురాంకు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి అద్భుతమైన ఆఫర్ ఇవ్వ‌డంతో స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని తీసిన పరశురాం ఈ చిత్రంతో […]

  • By: krs    latest    Jan 28, 2023 11:16 AM IST
నాగచైతన్య.. పరశురామ్‌ల ‘నాగేశ్వరరావు’ ఏమైంది..?

విధాత: గీతా గోవిందం చిత్రంతో పరశురాం స్టార్ డైరెక్టర్ అయిపోయారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో పరశురాం తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయడం కోసం కథను సిద్ధం చేశారు. నాగేశ్వరరావు అనే వర్కింగ్ టైటిల్‌ని కూడా పెట్టుకున్నారు.

ఇంతలోనే పరశురాంకు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి అద్భుతమైన ఆఫర్ ఇవ్వ‌డంతో స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని తీసిన పరశురాం ఈ చిత్రంతో కూడా మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సర్కారు వారి పాట విడుదలైన తరువాత నాగచైతన్యతో పరశురాం చిత్రం ఉంటుందని పలువురు భావించారు. కానీ సర్కారు వారి పాట విడుదలై ఏడెనిమిది నెలలైనా పరశురాం ఇప్పటికీ ఖాళీ గానే ఉన్నారు.

ఇక విషయానికి వస్తే ఈ చిత్రం కోసం పరశురాం తయారు చేసిన స్టోరీ నాగచైతన్యకు నచ్చలేదట. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసుకునే కుర్రాడు ఆ కంపెనీ ఓనర్ అయిన లేడీ బాస్‌తో లవ్ ట్రాక్ నడపడం అనేది ఈ చిత్రం మెయిన్ పాయింటుగా అర్థమవుతుంది.

కానీ ఈ చిత్రంలో హీరో కంటే హీరోయిన్ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంద‌ని భావించిన నాగ‌చైత‌న్య దీనికి నో చెప్పార‌ట‌. దాంతో దాన్ని పరశురాం కూడా హోల్డ్ లో పెట్టారు. ఈ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి రౌడీస్టార్ విజయ్ దేవరకొండకు సరిపోయేలా పరశురాం ఇదే కథను మెరుగులు దిద్దాడట.

గతంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలోనే పరశురాం తీసిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఈ చిత్రానికి రౌడీ స్టార్ అయితే ఖ‌చ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఓకే అంటే ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి 14 రీల్స్ సంస్థ సిద్ధంగా ఉంది. కానీ దీనిపై పరశురాం మాత్రం నోరు విప్పడం లేదు. ఆయన నోరు విప్పితే గాని సరైన క్లారిటీ అనేది రాదు అని చెప్పాలి.