Alpha-Gal Syndrome | మాంసం తిన‌డానికి భ‌య‌ప‌డుతున్న అమెరిక‌న్‌లు.. ఆ పురుగు కుట్ట‌డం వల్లేనా?

Alpha-Gal Syndrome విధాత‌: కొంత మంది అమెరిక‌న్ల‌కు మాంసం చూస్తుంటేను ఒళ్లంతా అల‌ర్జీ వ‌చ్చేసి వాంతుల‌తో ఇబ్బంది ప‌డిపోతున్నారు. మాంసం (Red Meat) అనే కాకుండా క్షీర‌దాల నుంచి త‌యారు చేసే పాలు పెరుగు ఇలా ఏ ఉత్ప‌త్తిని చూసినా వారికి ఇలానే జ‌రుగుతోంది. దీనిని శాస్త్రవేత్త‌లు ఆల్ఫా - గాల్ సిండ్రోం అని పిలుస్తున్నారు. లోన్ స్టార్ టిక్ అనే కీట‌కం కుట్ట‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 2010 త‌ర్వాతి నుంచి […]

Alpha-Gal Syndrome | మాంసం తిన‌డానికి భ‌య‌ప‌డుతున్న అమెరిక‌న్‌లు.. ఆ పురుగు కుట్ట‌డం వల్లేనా?

Alpha-Gal Syndrome

విధాత‌: కొంత మంది అమెరిక‌న్ల‌కు మాంసం చూస్తుంటేను ఒళ్లంతా అల‌ర్జీ వ‌చ్చేసి వాంతుల‌తో ఇబ్బంది ప‌డిపోతున్నారు. మాంసం (Red Meat) అనే కాకుండా క్షీర‌దాల నుంచి త‌యారు చేసే పాలు పెరుగు ఇలా ఏ ఉత్ప‌త్తిని చూసినా వారికి ఇలానే జ‌రుగుతోంది. దీనిని శాస్త్రవేత్త‌లు ఆల్ఫా – గాల్ సిండ్రోం అని పిలుస్తున్నారు. లోన్ స్టార్ టిక్ అనే కీట‌కం కుట్ట‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

2010 త‌ర్వాతి నుంచి అమెరికా (America) లో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ఆల్ఫా గాల్ (Alpha-gal) అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తుల‌ను ఆహారంగా ఇస్తే అల‌ర్జీకి గుర‌వుతారు. అమెరికా తూర్పు, ద‌క్షిణ ప్రాంతాల్లో క‌నిపించే లోన్ స్టార్ టిక్ (Lone Star tick) అనే ఒక కీట‌కం కాటు వేస్తే ఈ అల‌ర్జీకి బాధితులుగా మార‌తారు.

ఈ కాటు ద్వారా అది ఆల్ఫా గాల్ అనే షుగ‌ర్ మూల‌కాన్ని మ‌న శ‌రీరంలో పెడుతుంది. అది ఇబ్బందికర ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి తీవ్ర‌త‌ను ఇది దారుణంగా పెంచేస్తుంది. అందుకే స్వ‌ల్ప స్థాయిలో ప్ర‌తిస్పంద‌న‌లను ఇవ్వాల్సిన స‌మయాల్లోనూ మ‌న శ‌రీరం విప‌రీతంగా స్పందిస్తుంది. తాజాగా గ‌త వారం విడుద‌ల చేసిన రిపోర్టు ప్ర‌కారం.. 2010 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 4,50,000 మంది ఈ సిండ్రోం బారిన ప‌డ్డారు.

ముందుగా క్యాన్స‌ర్ పేషెంట్‌లు తీసుకునే స్టెరాయిడ్ల వ‌ల్లే ఈ సిండ్రోం వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. టిక్ కాటు వ‌ల్ల కూడా ఇది వ్యాపిస్తోంద‌ని త‌ర్వాత గుర్తించారు. జింక‌ల ద్వారా ఈ కీట‌కం న‌గ‌రాల స‌రిహ‌ద్దుల్లోకి అక్క‌డి నుంచి వివిధ మార్గాల్లో జ‌నావాసాల్లోకి వ‌స్తోంది. దీంతో ఈ అల‌ర్జీ బారిన ప‌డే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

మ‌ర‌ణం వ‌స్తోందా?

ఈ అల‌ర్జీ వ‌ల్ల మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు రికార్డు లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు న‌ర‌క‌ప్రాయంగా ఉంటాయ‌ని బాధితులు చెబుతున్నారు. విప‌రీతంగా ద‌ద్దుర్లు, వికారం, విరోచ‌నాలు, క‌డుపు నొప్పి, శ్వాస తీసుకోలేక‌పోవ‌డం, బ‌ద్ద‌కం, పెదాల నుంచి ర‌క్తం కార‌డం, గొంతు నొప్పి మొద‌లైనవి క‌లిసి చుట్టుముడ‌తాయ‌ని బెర్నాండైన్ అనే ఒక పేషెంట్ చెప్పారు.

అయితే మ‌రేదైనా అలెర్జీ అయితే మాంసం తిన్న త‌ర్వాతే త‌న ల‌క్ష‌ణాలు చూపిస్తాయి. కానీ ఆల్ఫా గాల్ సిండ్రోంలో మాత్రం ఆహారం తీసుకున్న కొన్ని గంట‌ల త‌ర్వాత దాని ప్ర‌భావం చూపిస్తుంది. స్టార్ టిక్ కుట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ వ్యాధి వ‌స్తుంద‌ని లేదు. అయితే ఈ వ్యాధికి చికిత్స లేక‌పోవ‌డం వ‌ల్ల కేసులు పెరుగుతూనే ఉంటున్నాయి.