ప్రధాని మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటో చెప్పాలి: లోక్‌సభలో రాహూల్ గాంధీ
అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉన్నదా? లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్ దేశమంతటా అదానీ పేరే వినిపిస్తున్నదని సెటైర్ విధాత: కాంట్రాక్టులన్నీ గౌతం అదానీకి అప్పగించడమే భారత దేశ విధానమా? అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉన్నదా? అని సవాల్ విసిరారు. ప్రజా […]

- అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉన్నదా?
- లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్
- దేశమంతటా అదానీ పేరే వినిపిస్తున్నదని సెటైర్
విధాత: కాంట్రాక్టులన్నీ గౌతం అదానీకి అప్పగించడమే భారత దేశ విధానమా? అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉన్నదా? అని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తను ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎంతో మంది ప్రజలు తమ బాధలు చెప్పుకొన్నారని అన్నారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ‘పాదయాత్రలో ఎంతోమంది నిరుద్యోగులు నన్ను కలిశారు. ఏం చదివారు? ఏం చేస్తున్నారు? అని అడిగాను. ఇంజినీరింగ్ చదివి కూడా ఉబెర్ కార్లు తోలుతున్నామని చెప్పారు. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నివీర్ గురించి యువకుల్లో నిర్లిప్తత కనిపించింది. అగ్నివీర్ అనేది ఆర్‌ఎస్‌ఎస్ విధానంగా మారుస్తున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు.
‘అదానీ’ గ్రూప్ మాయాజాలం.. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని కుంభకోణం
మోడీ-అదానీ మధ్య సంబంధం ఏమిటి?
తన పాదయాత్ర సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో అదానీ పేరే వినిపించిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ‘దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతున్నది. మోడీ-అదానీ మధ్య సంబంధం ఏమిటో తెలియాల్సి ఉన్నది. అదానీ సంపద అంతలా ఎలా పెరిగింది? 8 బిలియన్ల డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల ప్రజలు నన్ను ప్రశ్నించారు.’ అని రాహుల్ తెలిపారు.
‘ప్రధాని ఇజ్రాయిల్ వెళ్లాక అదానీకి కాంట్రాక్టులు వస్తాయి. భారత్-ఇజ్రాయిల్ రక్షణ ఒప్పందాల కాంట్రాక్టులు అదానీకే వెళ్తాయి. దేశీయ విమానాశ్రయాల్లో అదానీ వాటా పెరుగుతున్నది. ముంబై విమానాశ్రయం జీవీకే నుంచి అదానీకి కట్టబెట్టారు. అదానీ సంస్థలకు విమానాశ్రయం నిర్వహణలో అనుభవం లేదు. కాంట్రాక్టులన్నీఅదానీకి అప్పగించడమేనా భారత్ పాలసీ?’ అని ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు.
‘ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ పైసలు అదానీకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక పోర్టును అక్రమంగా ఆయనకు కట్టబెట్టారు. భారత్‌లోని పోర్టులు, విమానాశ్రయాలు ఆయన అదుపులోనే ఉన్నాయి’ అని చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉన్నదా? అని సవాల్ విసిరారు.
#WATCH | No posters please, if you will show posters then this side (BJP) will show poster of Rajasthan’s CM (with Gautam Adani). Showing posters isn’t appropriate: Lok Sabha Speaker Om Birla to Congress MP Rahul Gandhi pic.twitter.com/HHZIlymApr
— ANI (@ANI) February 7, 2023