ఇలా చేస్తే.. వాట్సాప్‌లో మీ చాట్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవచ్చు!

ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుంది.

ఇలా చేస్తే.. వాట్సాప్‌లో మీ చాట్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవచ్చు!

విధాత‌: ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. అదే సమయంలో మెరుగైన భద్రతను అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇందులో భాగంగా వాట్సాప్‌ ఈ మెయిల్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను యాడ్‌ చేసేంది. తాజాగా సీక్రెట్‌ చాట్‌లను ఓ కోడ్‌ సహాయంతో దాచుకునేందుకు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తేబోతున్నది.


యూజర్లు తాము రహస్యంగా దాచి పెట్టాలనుకునే చాట్‌లను ఓ సీక్రెట్‌ కోడ్‌ సహాయంతో సేవ్‌ చేసి పెట్టుకోవచ్చు. ఆ చాట్‌ హిస్టరీ సీక్రెట్‌ కోడ్‌ను టైప్‌ చేస్తేనే మళ్లీ ఓపెన్‌ అవుతుంది. సీక్రెట్‌ కోడ్‌లో నంబర్స్‌, లెటర్స్‌తో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. యూజర్లు తమ చాట్‌లను సురక్షిత కోడ్‌తో లాక్ చేసుకోవడానికి వీలుగా వాట్సాప్ సరికొత్తగా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది.


వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే చాట్‌ లాక్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది. తాజాగా సీక్రెట్‌ చాట్‌కు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. యూజర్లు ఏదైనా సీక్రెట్‌ చాట్‌ను దాచి ఉంచాలనుకుంటే.. ఇతరులు ఎవరూ ఓపెన్‌ చేసినా తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది. సెర్చ్‌ బార్‌లో కోడ్‌ను ఎంటర్‌ చేసిన సమయంలో మాత్రమే దాచిన చాట్‌ స్ర్కీన్‌పై కనిపిస్తుంది. చూసిన తర్వాత మళ్లీ లాక్‌ చేసుకునే వీలుంటుంది.


వాట్సాప్‌లోని ఏ చాట్‌ హిస్టరీని ఎవరికి కనిపించకుండా ఉంచాలనుకుంటున్నారో ఆ చాట్‌పై లాంగ్‌ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత చాట్‌కు సీక్రెట్‌ కోడ్‌ను ఇవ్వాల్సి. మళ్లీ చాట్‌ను చూడాలనుకుంటే సెర్చ్‌ బార్‌లో సీక్రెట్‌ కోడ్‌ను టైప్‌ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రైవేట్‌ సంభాషణను ఎవరూ అనుకోకుండా చూడలేరని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల వెల్లడించారు. వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం ప్రారంభించగా.. త్వరలోనే మిగతా యూజర్లందరికీ పరిచయం చేయబోతున్నది.