కొత్త పార్లమెంటులో ఉంటామో లేదో: ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
విధాత: కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలుగా ఉంటామో లేదోనని పిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన దీక్ష సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఎప్పుడు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగారు. స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అయ్యేనాటికి మనం ఎంపీలుగా […]

విధాత: కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలుగా ఉంటామో లేదోనని పిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన దీక్ష సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఎప్పుడు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగారు.
స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అయ్యేనాటికి మనం ఎంపీలుగా ఉంటామో లేదో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కడే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు రేపో మాపో మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్న నేపథ్యంలోనే ఉత్తమ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.