World Cup | 2011 వ‌రల్డ్ క‌ప్ ఆడి ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న ఆట‌గాళ్లు ఎవరెవ‌రో తెలుసా?

World Cup: మ‌రి కొద్ది రోజుల‌లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లు కానున్న విష‌యం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత స్వ‌దేశంలో టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా టైటిల్ ఫేవ‌రేట్‌గా నిలిచింది. అక్టోబ‌ర్ 5న ఈ టోర్నీ మొద‌లు కానున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ గురించి అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అయితే 2011లో ఇండియాలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఆడి ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఎవ‌రెవ‌రు ఆడ‌బోతున్నార‌నే దానిపై ఆస‌క్తికర చ‌ర్చ న‌డుస్తుంది. ఈ జాబితాలో […]

  • By: sn    latest    Jul 09, 2023 6:53 AM IST
World Cup | 2011 వ‌రల్డ్ క‌ప్ ఆడి ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న ఆట‌గాళ్లు ఎవరెవ‌రో తెలుసా?

World Cup: మ‌రి కొద్ది రోజుల‌లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లు కానున్న విష‌యం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత స్వ‌దేశంలో టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా టైటిల్ ఫేవ‌రేట్‌గా నిలిచింది. అక్టోబ‌ర్ 5న ఈ టోర్నీ మొద‌లు కానున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ గురించి అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అయితే 2011లో ఇండియాలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఆడి ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఎవ‌రెవ‌రు ఆడ‌బోతున్నార‌నే దానిపై ఆస‌క్తికర చ‌ర్చ న‌డుస్తుంది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆట‌గాళ్లు ఉండ‌గా, వారిలో మ‌న‌దేశం నుండి విరాట్ కోహ్లీ ఉన్నారు.

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీతో ఆడిన వారిలో అంద‌రు రిటైర్ కాగా, పీయూష్ చావ్లా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌లేదు. కాని అత‌ను ప్ర‌స్తుతం టీమిండియాకి ఆడ‌డం లేదు. టీమిండియా తరుపున 2011 వన్డే వరల్డ్ కప్ ఆడి, ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా విష‌యానికి వ‌స్తే 2011 వన్డే వరల్డ్ కప్‌లో స్పిన్నర్‌గా ఆడిన స్టీవ్ స్మిత్, 2023లో ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్‌గా ఆడబోతున్నాడు.. న్యూజిలాండ్ నుండి చూస్తే కేమ్స్ విలియ‌మ్ సన్ 2011లో ఆడి, ఇప్పుడు 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోను ఆడ‌నున్నాడు.

ఇక న్యూజిలాండ్ బౌల‌ర్ టిమ్ సౌథీ .. 2011 వన్డే వరల్డ్ కప్‌లో 18 వికెట్లు తీసి ఆ జ‌ట్టుని ముందుకు న‌డిపించాడు. ఈ 34 ఏళ్ల బౌల‌ర్ 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోను బ‌రిలో దిగే అవ‌కాశం ఉంది. ఇక 2007 వన్డే వరల్డ్ కప్‌ నుంచి క్రికెట్ ఆడుతున్న బంగ్లా ప్లేయ‌ర్ షకీబ్ అల్ హసన్ .. , 2011 వన్డే వరల్డ్ కప్‌లో 142 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆయ‌న 2023 వన్డే వరల్డ్ కప్ ఆడ‌నుండ‌గా, ఆయ‌నికి ఇది ఐదో ప్రపంచ కప్‌. ఇదే చివరిది కూడా అయ్యే అవ‌కాశం ఉంది. ఇక బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముస్ఫీకర్ రహీం..2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆడ‌గా, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతున్నారు.. సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మీ పేసర్ వేన్ పార్నెల్, 2011 వన్డే వరల్డ్ కప్ ఆడ‌గా, 2023లో అత‌ను ఆడ‌డం కాస్త డౌట్‌గానే ఉంది. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ టీమ్‌లో చోటు దక్కినా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు అదిల్ రషీద్. 2023లో మాత్రం అత‌ను ఇంగ్లాండ్‌కి ప్రధాన స్పిన్నర్‌గా మార‌బోతున్నాడు.