తన సినిమా ప్రమోషన్స్‌కు అజిత్ ఎందుకు రాడంటే!
విధాత: కోలీవుడ్‌లో జెంటిల్‌మేన్, సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ తర్వాత అజిత్ పేరు చెప్పాల్సి వస్తుంది. అజిత్ విషయానికి వస్తే ఇతడు విజయ్‌లా కాదు. విజయ్ తనను తాను ఆకాశానికి ఎత్తేసుకోవడం.. ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టడం వంటివి చేస్తుంటాడు. కానీ అజిత్ చాలా సున్నిత స్వభావుడు. తన పనేదో తాను చేసుకుని పోతూ ఉంటాడు. వివాద రహితుడు. తన ఫ్యాన్స్‌కు బ్యానర్లు, కటౌట్లు కట్టవద్దని, పూలతో, పాలతో అభిషేకం చేయవద్దని చెప్తూ ఉంటాడు. వాటిని సామాజిక సేవా కార్యక్రమాలకు […]

విధాత: కోలీవుడ్‌లో జెంటిల్‌మేన్, సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ తర్వాత అజిత్ పేరు చెప్పాల్సి వస్తుంది. అజిత్ విషయానికి వస్తే ఇతడు విజయ్‌లా కాదు. విజయ్ తనను తాను ఆకాశానికి ఎత్తేసుకోవడం.. ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టడం వంటివి చేస్తుంటాడు. కానీ అజిత్ చాలా సున్నిత స్వభావుడు. తన పనేదో తాను చేసుకుని పోతూ ఉంటాడు.
వివాద రహితుడు. తన ఫ్యాన్స్‌కు బ్యానర్లు, కటౌట్లు కట్టవద్దని, పూలతో, పాలతో అభిషేకం చేయవద్దని చెప్తూ ఉంటాడు. వాటిని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుతూ ఉంటాడు. తన వలన హీరోల మధ్య హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడం ఆయనకి ఇష్టం లేదు.
ఇదే విషయాన్ని గతంలో ఆయన పలుసార్లు చెప్పారు. మా వల్ల అనవసరంగా అమాయకులైన ఫ్యాన్స్ బలి కాకూడదని నేను కోరుకుంటున్నాను అని ఒకనాడు అజిత్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇక విషయానికొస్తే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ కలిగిన, అభిమాన బలం కలిగిన టాప్ హీరోలు అజిత్, విజయ్. వీరి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే వాటి హంగామా మామూలుగా ఉండదు.. అందులోనూ ఒకేరోజు వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే ఇక అక్కడ యుద్ధ వాతావరణమే.
ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదే జరగనుంది. అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకే రోజున జనవరి 11న విడుదల కాబోతున్నాయి. ఈ రెండింటికి సమానమైన థియేటర్లు ఇవ్వడం దగ్గర నుండి ప్రతిదీ సమానంగా ఉండాల్సిందే. ఎవరికి ఎక్కువైనా మరొక హీరో ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం.
ఇదిలా ఉంటే అజిత్ ప్రతి సినిమాకు ప్రమోషన్స్‌లో పాల్గొనడు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ఒక సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్న సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవై ఒక విజయ్ అభిమాని చనిపోయాడు. అప్పటినుండి అజిత్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
తన చిత్రాలకు ప్రమోషన్స్ లేకపోయినా పరవాలేదు గానీ అభిమానుల మధ్య మరింత ద్వేషం రగిలించడం ఇష్టం లేదనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కాగా విజయ్ మాత్రం అలా కాదు. నాకు నేనే పోటీ… నాకెవ్వరూ పోటీ కాదు.. నాకు ఒకటి ఇస్తే నేను మూడుగా ఇస్తా…. ఇలాంటి పంచ్ డైలాగులు వేస్తూ ద్వేషాలు రగిలిస్తూ ఫ్యాన్స్‌ను కెలికే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆయనకు తోడు దిల్ రాజు వంటి నిర్మాతలు కూడా అనవసరంగా మౌనంగా ఉండే అజిత్ ఫ్యాన్స్‌ని తమ సినిమా పబ్లిసిటీ కోసం, ఆ హీరోల మెప్పుకోసం ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ అజిత్ మాత్రం మౌనమే ఆయుధంగా ముందుకు సాగుతూ ఉంటాడు. దీన్నిబట్టి విజయ్, అజిత్‌లలో ఎవరు? జెంటిల్‌మేన్ అన్నది సులభంగా అందరూ అర్థం చేసుకోవచ్చు.