Washing Powder Nirma | ‘వాషింగ్ పౌడర్ నిర్మా..’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు స్వాగతం.. నగరంలో వెలిసిన భారీ హోర్డింగ్‌లు
Washing Powder Nirma | హకీంపేటలోని నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జరుగుతున్న రైజింగ్ డే పరేడ్ ఆదివారం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, అమిత్ షాకు స్వాగతం తెలుపుతూ నగరంలో వినూత్న భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అంటూ.. వెల్‌కమ్ అమిత్ షా అంటూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఎవరు ఈ హోర్డింగ్‌లు వేశారన్నది తెలియదు […]

Washing Powder Nirma | హకీంపేటలోని నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) జరుగుతున్న రైజింగ్ డే పరేడ్ ఆదివారం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, అమిత్ షాకు స్వాగతం తెలుపుతూ నగరంలో వినూత్న భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అంటూ.. వెల్‌కమ్ అమిత్ షా అంటూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఎవరు ఈ హోర్డింగ్‌లు వేశారన్నది తెలియదు కానీ.. బీఆర్‌ఎస్ వర్గాల పనేనని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. హోర్డింగ్‌లో పలు పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల పేర్లను సైతం ప్రస్తావించడం విశేషం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అంటూ నేతలు బీజేపీలో చేరుతున్న వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హోర్డింగ్‌ల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Welcome Amit Shah ! ! pic.twitter.com/J28jCJBU7p
— Krishank (@Krishank_BRS) March 12, 2023
నిర్మా సర్ఫ్‌తో బట్టలతో బట్టలపై ఉన్న మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా.. బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయన్నట్లుగా చురకలంటూ ఈ పోస్టర్లు వెలిశాయి. నిర్మా అడ్వర్‌టైజ్‌లో కనిపించే అమ్మాయి తల స్థానంలో ప్లేస్‌లో బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, ఈశ్వరప్ప సహా పలువురు నేతల ఫొటోలను పెట్టారు. శనివారం సైతం నగరంలో పలుచోట్ల ఆయా నేతల ఫొటోలతో హోర్డింగ్‌లో వెలసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను విచారించిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా విచారించి, ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోస్టర్లు భారీగా వెలిశాయి. ఈడీ, సీబీఐ తదితర సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు బీజేపీ పని చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ నేతలతో చర్చించిన అమిత్ షా..
అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కోర్ కమిటీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో జరిగే సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొంటారు. అయితే, ఢిల్లీ ఎన్‌సీఆర్ వెలుపల సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ వేడుకలు ఇదే తొలిసారి. వేడుకల్లో పాల్గొన్న అనంతరం అమిత్ షా కేరళకు వెళ్లనున్నారు. అక్కడ త్రిసూర్‌లో ర్యాలీలో ప్రసంగిస్తారు.