Rohit Sharma | రెండో టెస్ట్ కోసం రోహిత్ శ‌ర్మ ఇన్ని మార్పులు చేస్తున్నాడా.. ఫ‌లితం ఎలా ఉంటుంది..!

Rohit Sharma | వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్‌ను భారత జట్టు గ్రాండ్‌గా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ అరంగేట్రం చేయ‌గా, జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.. ఇక ఇషాన్ కిషన్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న కీపింగ్‌లో ఫర్వాలేదనిపించిన బ్యాటింగ్‌లో సత్తా నిరూపించు కునే అవకాశం […]

  • By: sn    latest    Jul 20, 2023 5:34 AM IST
Rohit Sharma | రెండో టెస్ట్ కోసం రోహిత్ శ‌ర్మ ఇన్ని మార్పులు చేస్తున్నాడా.. ఫ‌లితం ఎలా ఉంటుంది..!

Rohit Sharma |

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్‌ను భారత జట్టు గ్రాండ్‌గా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ అరంగేట్రం చేయ‌గా, జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు..

ఇక ఇషాన్ కిషన్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న కీపింగ్‌లో ఫర్వాలేదనిపించిన బ్యాటింగ్‌లో సత్తా నిరూపించు కునే అవకాశం అయితే దక్కలేదు. ఇక గురువారం (జులై 20) నుంచి వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానుండ‌గా, ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్ర‌యోగాలు చేస్తారా అని అందరు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సెకండ్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా? అని ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం జ‌ట్టులో ఎవ‌రిని తీసేయాల‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఇప్ప‌టికే జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, రహానేకు టాప్-5 స్థానాలకి ఫిక్స్ కాగా, ఈ మ్యాచ్‌లో గైక్వాడ్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కడం అనుమానంగా ఉంది.

ఇక బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండ‌గా, శార్ధూల్‌ని ప‌క్క‌న పెట్టి ముఖేష్‌ని ఆడిస్తార‌నే టాక్ ఉంది. శార్దూల్ బ్యాట్ తోనూ అద్భుతంగా రాణించ‌గ‌లిగిన స‌త్తా ఉన్నా కూడా ఇప్పటికే జట్టులో జడేజా, అశ్విన్ లాంటి ఆల్ రౌండర్లు ఉండటంతో ముకేష్‌ని తీసుకునే ధైర్యం రోహిత్ చేయ‌వ‌చ్చు.

తొలి టెస్ట్ మ్యాచ్‌లో మూడోస్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్, చాలా రోజుల తర్వాత ఇండియన్ టీమ్ లోకి వచ్చిన అజింక్య రహానే పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. వీళ్లిద్ద‌రు రెండో టెస్టులో రాణించాల్సి ఉంది. ఇక‌ పేస్ బౌలింగ్ విష‌యానికి వ‌స్తే ఈ ఇద్ద‌రు కూడా పెద్ద‌గా వికెట్స్ తీయ‌లేక‌పోయారు. అయిన‌ప్ప‌టికీ సిరాజ్, జైదేవ్ ఉనద్కట్ తుది జట్టులో కొనసాగనున్నారు.వారికి జ‌త‌గా ఇప్పుడు ముకేష్ రానుండ‌డంతో బౌలింగ్ లైన‌ప్ కూడా గ‌ట్టిగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.