ఒక రాత్రి.. శృంగారానికి రెండోసారి ఒప్పుకోలేదని భార్య హత్య
Uttar Pradesh | ప్రతి భార్యాభర్త శృంగారాన్ని కోరుకుంటారు. ఆ ప్రక్రియ ద్వారా వచ్చే అనుభూతిని తనివితీరా ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. అంతటి గొప్ప కార్యం కోసం ప్రతి జంట ఎదురు చూస్తుంది. నువ్వానేనా అన్న రీతిలో శృంగారంలో మునిగిపోతారు. కానీ ఆ ప్రక్రియనే ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక రాత్రి.. శృంగారానికి రెండోసారి ఒప్పుకోలేదని భార్యను హత్య చేశాడు భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహా జిల్లాకు చెందిన […]

Uttar Pradesh | ప్రతి భార్యాభర్త శృంగారాన్ని కోరుకుంటారు. ఆ ప్రక్రియ ద్వారా వచ్చే అనుభూతిని తనివితీరా ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. అంతటి గొప్ప కార్యం కోసం ప్రతి జంట ఎదురు చూస్తుంది. నువ్వానేనా అన్న రీతిలో శృంగారంలో మునిగిపోతారు. కానీ ఆ ప్రక్రియనే ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక రాత్రి.. శృంగారానికి రెండోసారి ఒప్పుకోలేదని భార్యను హత్య చేశాడు భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహా జిల్లాకు చెందిన మహ్మద్ అన్వర్(34)కు తొమ్మిదేండ్ల క్రితం పెళ్లి అయింది. అన్వర్‌కు భార్య(30) ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ప్రతి రోజు అన్వర్ తన భార్యతో సరదాగా గడిపేవాడు. ఒక్కసారి కాకుండా రెండుసార్లు శృంగారం చేద్దామని భార్యను కోరేవాడు అన్వర్. కానీ భార్య అందుకు అంగీకరించేది కాదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భర్త అన్వర్ భార్యను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమెను తన ఇంటికి 50 కిలోమీటర్ల దూరంలోని పంట పొలాల్లో పడేశాడు.
అయితే మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. అన్వర్ అమ్రోహాలో బేకరి నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.