తోటి యంగ్ హీరోలను చూసైనా ఈ హీరో మారుతాడా..!
విధాత: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు సోదరి భర్త అయినా సుధీర్ బాబు మంచి ఆజానుబాహుడు. దానికి తోడు కండలు తిరిగిన శరీరంతో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను కూడా భాగి చిత్రంలో మెప్పించారు. ఈయన నటన బాలీవుడ్ వారికి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈయన ఎత్తు, పొడవు దానికి తగ్గ కండలు తిరిగిన శరీరం చూస్తే ఓ మాస్ యాక్షన్ హీరోకు ఉండాల్సిన […]

విధాత: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు సోదరి భర్త అయినా సుధీర్ బాబు మంచి ఆజానుబాహుడు. దానికి తోడు కండలు తిరిగిన శరీరంతో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను కూడా భాగి చిత్రంలో మెప్పించారు. ఈయన నటన బాలీవుడ్ వారికి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈయన ఎత్తు, పొడవు దానికి తగ్గ కండలు తిరిగిన శరీరం చూస్తే ఓ మాస్ యాక్షన్ హీరోకు ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఈయనకు ఉన్నాయని చెప్పక తప్పదు.
ప్రస్తుతం అడివి శేషు, విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ, నాగశౌర్య, సిద్దు జొన్నలగడ్డ, చివరకు సత్యదేవ్ వంటి వారు కూడా పలు వెరైటీ చిత్రాలను చేస్తున్నారు. కానీ సుధీర్ బాబు మాత్రం తన బాడీ లాంగ్వేజ్ కి ఏమాత్రం సెట్ కానీ ఫీల్ గుడ్ చిత్రాలను ఎంచుకుంటూ ఉన్నారు. ఫీల్ గుడ్ చిత్రాలు ఎంచుకోవడంలో ఆయన టేస్ట్ చాలా బాగుంది. ఆయన బాడీ చూస్తే మాస్ యాక్షన్ హీరోను తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తనకు తగిన యాక్షన్ చిత్రాలను ఎంచుకుంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
ఎందరో హీరోలు మాస్ యాక్షన్ ఇమేజ్ కోసం తంటాలు పడుతూ ఉంటారు. కానీ వారికి ఆ విధమైన ఫిజిక్ లేకపోవడంతో వెనుకబడిపోతూ ఉంటారు. కానీ యాక్షన్ హీరో కు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ను దగ్గర ఉంచుకొని సుధీర్ బాబు ఇలా ఫీల్ గుడ్ చిత్రాలు ఎంచుకోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. యాక్షన్ చిత్రాల ఎంపికలో కూడా ఆయన సరైన కథలను ఎంచుకోవడం లేదనడానికి తాజాగా వచ్చిన హంట్ చిత్రమే ఉదాహరణ. ఆయన నటించిన భలే మంచి రోజు, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం వంటి హిట్స్ ఉన్నాయి.
అయితే ఇవన్నీ డీసెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటివరకు ఈయన 17 సినిమాలు చేశాడు. ఇందులో పక్కా మాస్ యాక్షన్ చిత్రం ఒక్కటి కూడా లేదు. మరోవైపు ఈయన బావ మహేష్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ చిత్రాలను ఎంచుకుంటూ అపజయమనేదే లేకుండా ముందుకు దూసుకుని వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో తన తోటి యంగ్ హీరోలు, తన బావ నుంచి ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వారి నుండి తగిన పాఠం నేర్చుకొని తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ చిత్రాలను సుధీర్ బాబు ఎంచుకుంటాడో లేదో చూడాలి….!