Kesineni Nani | TDPలో ఉక్కబోత.. ఫ్యాన్ కిందకు కేశినేని!
Kesineni Nani | జగన్‌కు ఎంపీ అభ్యర్థి దొరికినట్టేనా..! విధాత: రాజధాని లాంటి విజయవాడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు దొరకడం లేదు. పార్టీ పెట్టిన నాటి నుంచీ 2014, 2019 లోక్ సభ ఎన్నికలు జరగా విజయవాడలో రెండు సార్లూ వైసీపీ ఓడి పోయింది. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయగా ఆయన మీద కేశినేని నాని టీడీపీ తరఫున గెలిచారు. మళ్ళీ 2019లో ఎన్నికలు జరగగా అప్పుడు పొట్లూరి వర ప్రసాద్(పీవీపీ) […]

Kesineni Nani |
- జగన్‌కు ఎంపీ అభ్యర్థి దొరికినట్టేనా..!
విధాత: రాజధాని లాంటి విజయవాడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు దొరకడం లేదు. పార్టీ పెట్టిన నాటి నుంచీ 2014, 2019 లోక్ సభ ఎన్నికలు జరగా విజయవాడలో రెండు సార్లూ వైసీపీ ఓడి పోయింది. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయగా ఆయన మీద కేశినేని నాని టీడీపీ తరఫున గెలిచారు. మళ్ళీ 2019లో ఎన్నికలు జరగగా అప్పుడు పొట్లూరి వర ప్రసాద్(పీవీపీ) పోటీ చేసి మళ్ళీ కేశినేని నాని (Kesineni Nani) చేతిలో ఓడిపోయారు.
వాస్తవానికి విజయవాడకు జగన్ పార్టీకి ఎంపీ అభ్యర్థి కొరత ఉంది. గతంలో ఓడిపోయిన వరప్రసాద్, రాజేంద్ర ప్రసాద్.. ఈ ఇద్దరూ ఓడిపోగానే పత్తాలేకుండా పోయారు. పార్ట్ టైం పాలిటిక్స్‌లోకి వచ్చి ఓడిపోయాక మళ్ళీ తమ వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు తప్ప లోకల్లో ఉంటూ క్యాడర్‌ను కాపాడుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో తోడు లేకుండా పోయారు.
దీంతో వీరికి ఇక్కడ బేస్ లేకుండా పోయింది. తమ నాయకుడు ఈయన అని చెప్పుకునే స్థాయిలో ఈ ఇద్దరూ లేకపోవడంతో మళ్ళీ కొత్త అభ్యర్థిని వెతికే అవసరం వచ్చింది. దీంతో ఇక్కడ కేశినేని నాని అయితే బావుంటుందని వైసీపీ భావిస్తోంది. అందుకే మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆయనతో మాట కలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే ఒకరినొకరు పొగుడుకున్నారు. అంతేకాకుండా నిన్న వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి సైతం కేశినేని విషయంలో పాజిటివ్‌గా మాట్లాడుతూ ఆయన వస్తాను అంటే ఆహ్వానిస్తామని అన్నారు. దీంతో నాని ఆగమనానికి వైసిపి డోర్లు తెరిచినట్లు స్పష్టమైంది.
మరోవైపు కేశినేని నానికి టిడిపిలో పోగబెట్టడం ఎక్కువైంది. కేశినేని నాని తమ్ముడు చిన్నిని చంద్రబాబు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు రానున్న ఎన్నికల్లో టికెట్ సైతం ఆయనకే అని క్లారిటీ ఇచ్చేశారు.
మరోవైపు విజయవాడలో బోండా ఉమా.. బుద్ధ వెంకన్న.. గద్దె రామ్మోహన్ వంటి వారు సైతం నానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఎందుకు ఉండడం అని ఆయన భావిస్తున్న తరుణంలో వైసిపి నుంచి పిలుపు వచ్చింది.దీంతో ఆయన టిడిపిలో ఉక్కబోత భరించలేక ఫ్యాన్ కిందకు చేరతారని అంటున్నారు.