Crime News | మ‌రో మ‌హిళ‌తో తండ్రి రాస‌లీల‌లు.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న పదేండ్ల కూతురు

Crime News | ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కుటుంబాన్ని పోషించాలంటే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఉద్యోగాలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలా దంప‌తులిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ ప్ర‌పంచంలో ఎంతో మంది ఉన్నారు. కొంద‌రు నేరుగా వ‌ర్క్ ప్లేస్‌కు వెళ్లి ఉద్యోగం చేస్తుంటే.. ఇంకొంద‌రేమో వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఓ మ‌హిళ ఆస్ప‌త్రికి వెళ్లి న‌ర్సుగా విధులు నిర్వ‌ర్తిస్తుంటే.. త‌న భ‌ర్తేమో ఇంట్లోనే ఉంటూ వ‌ర్క్ చేస్తున్నాడు. భార్య బ‌య‌ట‌కు వెళ్లి ఉద్యోగం చేస్తుండ‌డంతో ఇదే […]

Crime News | మ‌రో మ‌హిళ‌తో తండ్రి రాస‌లీల‌లు.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న పదేండ్ల కూతురు

Crime News | ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కుటుంబాన్ని పోషించాలంటే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఉద్యోగాలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలా దంప‌తులిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ ప్ర‌పంచంలో ఎంతో మంది ఉన్నారు. కొంద‌రు నేరుగా వ‌ర్క్ ప్లేస్‌కు వెళ్లి ఉద్యోగం చేస్తుంటే.. ఇంకొంద‌రేమో వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

అయితే ఓ మ‌హిళ ఆస్ప‌త్రికి వెళ్లి న‌ర్సుగా విధులు నిర్వ‌ర్తిస్తుంటే.. త‌న భ‌ర్తేమో ఇంట్లోనే ఉంటూ వ‌ర్క్ చేస్తున్నాడు. భార్య బ‌య‌ట‌కు వెళ్లి ఉద్యోగం చేస్తుండ‌డంతో ఇదే అదునుగా భావించిన భ‌ర్త‌.. మ‌రో మ‌హిళ‌తో రాస‌లీలలు కొన‌సాగిస్తున్నాడు. తండ్రి మ‌రో మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న స‌మ‌యంలో అత‌ని 10 ఏండ్ల కూతురు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఈ స్టోరీని అమెరికాకు చెందిన ఓ మ‌హిళ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది.

బాధితురాలి మాట‌ల్లోనే.. ‘నేను న‌ర్సుగా ఉద్యోగం చేస్తున్నాను. నా భ‌ర్త వ‌ర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. మాకు 10 ఏండ్ల కూతురు ఉంది. నాకు నైట్ డ్యూటీలు ఉంటాయి కాబ‌ట్టి.. కూతురు ఆల‌నా పాల‌న‌ను నా భ‌ర్త‌కు అప్ప‌గించి వెళ్లేదాన్ని. ఇక వీకెండ్‌లో రిలాక్స్ అయ్యేందుకు నా భ‌ర్త అత‌ని స్నేహితుల‌ను ఇంటికి పిలిపించుకునే వాడు.

వారం మొత్తం వ‌ర్క్ బిజీలో ఉండి, వీకెండ్‌లో రిలాక్స్ అవ్వ‌డాన్ని కూడా నేను ప‌ట్టించుకోలేదు. అత‌ని స్నేహితుల‌ను ఇంటికి రావొద్ద‌ని కూడా నేను ఎప్పుడు చెప్ప‌లేదు. కానీ ఒక రోజు స్నేహితులంద‌రూ ఇంటికి వ‌చ్చారు. అందులోని ఒక మ‌హిళ‌తో నా భ‌ర్త అత్యంత స‌న్నిహితంగా ఉన్నాడ‌ని నా కూతురు చెప్పింది. ఇద్ద‌రూ శారీర‌కంగా క‌లుసుకున్నార‌ని, దాంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన‌ట్లు నా కూతురు చెప్పింది.

నా బిడ్డ ఈ విష‌యాలు చెప్పాక షాక్‌కు గుర‌య్యాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతద‌ని జీవితంలో ఎప్పుడూ ఊహించ‌లేదు. నా భ‌ర్త ప్ర‌వ‌ర్త‌నతో విసుగు చెందాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. బాధిత మ‌హిళ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భ‌ర్త‌పై పోరాటం చేస్తుంది.

త‌న భ‌ర్త‌పై పోరాటానికి ప‌లువురి నుంచి న్యాయ స‌ల‌హాలు తీసుకుంటుంది. మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతుంది. ఆమెకు జ‌రిగిన అన్యాయంపై ప‌లువురు నెటిజ‌న్లు కూడా స్పందించారు. మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా ఇచ్చారు. ఆమె భ‌ర్త‌పై లీగ‌ల్‌గా ఫైటింగ్ చేయాల‌ని సూచించారు. కొంద‌రేమో అత‌నికి దూరంగా ఉండాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలో ధైర్యంగా ఉండాల‌ని, అన‌వ‌స‌ర ఆందోళ‌కు గురి కావొద్ద‌ని ప‌లువురు సూచించారు.