మహిళకు తీవ్రమైన దగ్గు.. పక్కటెముకలు విరిగిపోయాయి..
Chinese woman | తీవ్రమైన దగ్గు వస్తే శరీరమంతా కదిలిపోతోంది. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఆయాసం వస్తుంది. కానీ ఓ మహిళకు తీవ్రమైన దగ్గు రావడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ ఘటన చైనాలోని షాంఘై నగరంలో వెలుగు చూసింది. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల ఘాటైన ఆహారం తిన్నది. ఆ తర్వాత ఒక్కసారిగా తీవ్రమైన దగ్గు వచ్చింది. తీవ్రంగా దగ్గుతున్న సమయంలో ఛాతీలో నుంచి శబ్దం వినిపించింది. కానీ ఆమె పట్టించుకోలేదు. కొద్ది రోజులకు […]

Chinese woman | తీవ్రమైన దగ్గు వస్తే శరీరమంతా కదిలిపోతోంది. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఆయాసం వస్తుంది. కానీ ఓ మహిళకు తీవ్రమైన దగ్గు రావడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ ఘటన చైనాలోని షాంఘై నగరంలో వెలుగు చూసింది.
షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల ఘాటైన ఆహారం తిన్నది. ఆ తర్వాత ఒక్కసారిగా తీవ్రమైన దగ్గు వచ్చింది. తీవ్రంగా దగ్గుతున్న సమయంలో ఛాతీలో నుంచి శబ్దం వినిపించింది. కానీ ఆమె పట్టించుకోలేదు.
కొద్ది రోజులకు ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. చేసేదేమీ లేక వైద్యులను సంప్రదించింది. డాక్టర్లు హువాంగ్‌కు సీటీ స్కాన్ నిర్వహించగా, నాలుగు పక్కటెముకలు విరిగినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు బ్యాండేజీలు అవసరం పడటంతో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అయితే బాధితురాలి పక్కటెముకలు విరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఆమె బక్కగా ఉండటం వల్ల పక్కటెముకలకు ఆధారంగా ఉండే కండరం సరియైనంత లేదని చెప్పారు. దీంతో గట్టిగా దగ్గినప్పుడు పక్కటెముకలు విరిగిపోయి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.