తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కుమార్తెకు పెళ్లి చేసిన తల్లి
Maharashtra | విధాత: నవమోసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించింది. రాక్షసుల నుంచి బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లే.. క్రూరమైన చర్యకు పాల్పడింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కూతురికి బలవంతంగా వివాహం జరిపించింది. అంతేకాదు అతనికి శారీరకంగా దగ్గర కావాలని బలవంతం చేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ 38 ఏండ్ల మహిళ తన కుమార్తె(15)తో కలిసి పుణెలో ఉంటోంది. అయితే వివాహితకు […]

Maharashtra | విధాత: నవమోసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించింది. రాక్షసుల నుంచి బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లే.. క్రూరమైన చర్యకు పాల్పడింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కూతురికి బలవంతంగా వివాహం జరిపించింది. అంతేకాదు అతనికి శారీరకంగా దగ్గర కావాలని బలవంతం చేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 38 ఏండ్ల మహిళ తన కుమార్తె(15)తో కలిసి పుణెలో ఉంటోంది. అయితే వివాహితకు 28 ఏండ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆ యువకుడి కన్ను ఆమె కూతురుపై పడింది. దీంతో ఆ యువకుడితో తన కూతురికి బలవంతంగా పెళ్లి చేసింది. అనంతరం అతనితో శృంగారం చేయాలని ఆదేశించింది. తల్లి చేసిన పనులకు ఆ బిడ్డ మనసులోనే కుంగిపోతోంది.
చివరకు ఆ బాధను తట్టుకోలేక తన స్నేహితురాలికి ఆ బాలిక చెప్పింది. స్నేహితురాలి ద్వారా స్వచ్ఛంద సంస్థలకు సమాచారం తెలిసిది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, తల్లితో పాటు ఆ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన అహ్మద్‌నగర్‌లో బాలికకు వివాహం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.