Haryana | ఎమ్మెల్యే చెంప ఛెల్లుమ‌నిపించిన మ‌హిళ‌.. ఎందుకో తెలుసా..?

Haryana | హ‌ర్యానాను వ‌ర్షాలు ముంచెత్తాయి. వ‌ర‌ద‌లు కూడా పోటెత్త‌డంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కైథాల్ జిల్లాలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన జన్ నాయ‌క్ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వ‌ర్ సింగ్‌పై ఓ మ‌హిళ దాడి చేసింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండ‌గానే ఆమె అత‌ని చెంప ఛెల్లుమ‌నిపించింది. ఈ ఘ‌ట‌న గుహ్లా చీకా నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం చోటు చేసుకుంది. డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేక‌పోవ‌డంతోనే.. వ‌ర‌ద నీళ్లు కాల‌నీల్లో నిలిచిపోయింద‌ని, ఇండ్ల‌లోకి కూడా […]

Haryana | ఎమ్మెల్యే చెంప ఛెల్లుమ‌నిపించిన మ‌హిళ‌.. ఎందుకో తెలుసా..?

Haryana | హ‌ర్యానాను వ‌ర్షాలు ముంచెత్తాయి. వ‌ర‌ద‌లు కూడా పోటెత్త‌డంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కైథాల్ జిల్లాలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన జన్ నాయ‌క్ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వ‌ర్ సింగ్‌పై ఓ మ‌హిళ దాడి చేసింది.

ఎమ్మెల్యే మాట్లాడుతుండ‌గానే ఆమె అత‌ని చెంప ఛెల్లుమ‌నిపించింది. ఈ ఘ‌ట‌న గుహ్లా చీకా నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం చోటు చేసుకుంది.

డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేక‌పోవ‌డంతోనే.. వ‌ర‌ద నీళ్లు కాల‌నీల్లో నిలిచిపోయింద‌ని, ఇండ్ల‌లోకి కూడా ప్ర‌వేశించింద‌ని స్థానికులు వాపోయారు. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు రాకుండా, ఇప్పుడు రావ‌డం ఏంట‌ని ఎమ్మెల్యేను మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో కోపంతో ఊగిపోయిన ఓ మ‌హిళ‌, ఎమ్మెల్యేపై చేయి చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే ఇక్క‌డికి ఇప్పుడు ఎందుకు వ‌చ్చావ‌ని ఎమ్మెల్యేను స్థానికులు నిల‌దీశారు.