ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. 65 ఏండ్లలో ఒకేసారి స్నానం

World's dirtiest man |విధాత: ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇరాన్ కు చెందిన అమౌ హజీ(94) ఇక లేరు. స్నానమంటేనే అస్యహించుకునే హజీ.. గత 65 ఏండ్లలో ఒకే ఒక్కసారి స్నానం చేశాడు. సుమారు ఆరు దశాబ్దాలుగా పరిశుభ్రతకు దూరంగా ఉన్న హజీ ఈ ఏడాది అక్టోబర్ 23న తుది శ్వాస విడిచినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. ఇరాన్‌ దక్షిణ ప్రావిన్సు […]

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. 65 ఏండ్లలో ఒకేసారి స్నానం

World’s dirtiest man |విధాత: ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇరాన్ కు చెందిన అమౌ హజీ(94) ఇక లేరు. స్నానమంటేనే అస్యహించుకునే హజీ.. గత 65 ఏండ్లలో ఒకే ఒక్కసారి స్నానం చేశాడు. సుమారు ఆరు దశాబ్దాలుగా పరిశుభ్రతకు దూరంగా ఉన్న హజీ ఈ ఏడాది అక్టోబర్ 23న తుది శ్వాస విడిచినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

ఇరాన్‌ దక్షిణ ప్రావిన్సు ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఒంటరిగా నివసించే అమౌ హజీకి కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. దీంతో గ్రామస్థులే అతడి కోసం చిన్న గుడిసెను ఏర్పాటు చేశారు. అమౌ హాజీ తన జీవిత కాలంలో సబ్సుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న సందర్భాలే లేవు. ఇక స్నానమంటేనే అతనికి పరమ అసహ్యం. చనిపోయిన మూగజీవాలను తింటూ జీవనం కొనసాగించేవాడు.

ఒకేసారి నాలుగైదు సిగరెట్ల పీల్చుతూ కాలం గడిపేవాడు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని భావించి, హజీ స్నానానికి దూరంగా ఉన్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇక హజీ జీవితంపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అటువంటి వ్యక్తికి గ్రామస్థులందరూ కలిసి కొన్ని నెలల కిందట బలవంతంగా స్నానం చేయించారు. అలా జరిగిన కొన్నిరోజులకే హజీ కన్నుమూశారు.

షేక్‌ అవుతున్న ఇంటర్నెట్.. ఈ వీడియో చూసే దమ్ముందా..?