Big Crocodile: వామ్మో ఎంత పెద్ద మొసలి..చూస్తేనే భయం !

Big Crocodile: వామ్మో ఎంత పెద్ద మొసలి..చూస్తేనే భయం !

Big Crocodile : జలచరాలలో మొసలి నీళ్లలో అత్యంత శక్తివంతమైనది. నీటిలోని స్థాన బలంతో మొసలి పట్టుకు చిక్కిన ఏనుగు కూడా తప్పించుకోవడం అసాధ్యం. ఇందుకు పురాణాల్లో గజేంద్ర మోక్షం ఘట్టం నిదర్శనం. అలాంటి మొసళ్లలో కొన్ని భారీ మొసళ్లు చూస్తే మనుషులకు దడ పుట్టాల్సిందే. ఆస్ట్రేలియాలోని ఓ పర్యాటక ప్రాంతంలో నదిలో సంచరిస్తున్న ఓ భారీ మొసలి ఆకారం చూసి వామ్మో మొసళ్లు ఇంత భారీ సైజులో ఉంటాయా అని నోరెళ్లబెట్టక మానరు. దానిని దూరం నుంచి ఓ బోట్ లో ప్రయాణిస్తున్న వారు వీడియో తీశారు. దీంతో ఆ భారీ మొసలి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అస్ట్రేలియా భారీ మొసళ్లకు నెలవు. ఇక్కడ ఉప్పు నీటి సరస్సులు, నదులు పెద్ద ఎత్తున మొసళ్లకు అవాసంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సైజులో 18అడుగుల నుంచి 15.5అడుగుల వరకు ఉన్న పలు మొసళ్లు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి.

మొసళ్లను రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 1970లలో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కారణంగా ఆస్ట్రేలియాలో మొసళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ప్రపంచ అతిపెద్ద మొసలి అస్ట్రేలియాకు చెందిన స 18అడుగుల కాసియస్(వయసు 112ఏండ్లు) చనిపోయింది. అయితే దాని పరిణామంలో ఉండే మొసళ్లు ఇంకా ఉన్నాయని తాజా వీడియో చూస్తే తెలుస్తుంది. నార్తర్న్ టెరిటరీయో, క్విన్ ల్యాండ్స్ ప్రాంతాల్లో భారీ మొసళ్లు కనిపిస్తుంటాయని వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు.