Wrestlers Protest | అర్థరాత్రి రెజ్లర్లపై పోలీసుల దాడి.. పతకాలు తిరిగి ఇచ్చేస్తామన్న మల్లయోధులు

అర్థరాత్రి మల్లయోధులపై పోలీసుల దాడి వినేశ్‌ ఫొగట్‌ సహా రెజ్లర్లను ఈడ్చేసిన పోలీసులు పలువురు రెజ్లర్లకు గాయాలు కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్ జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు విధాత : ఢిల్లీలో జరుగుతున్న రెజ్లర్ల ఆందోళన (Wrestlers Protest) మరింత తీవ్రరూపం దాల్చుతున్నది. బుధవారం అర్థరాత్రి పోలీసులు దీక్షా శిబిరంపై విరుచుకుపడి, ఆందోళనకారులను ఈడ్చిపారేయడంపై రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు విరుచుకుపడి, చేయి […]

Wrestlers Protest | అర్థరాత్రి రెజ్లర్లపై పోలీసుల దాడి.. పతకాలు తిరిగి ఇచ్చేస్తామన్న మల్లయోధులు
  • అర్థరాత్రి మల్లయోధులపై పోలీసుల దాడి
  • వినేశ్‌ ఫొగట్‌ సహా రెజ్లర్లను ఈడ్చేసిన పోలీసులు
  • పలువురు రెజ్లర్లకు గాయాలు
  • కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్
  • జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

విధాత : ఢిల్లీలో జరుగుతున్న రెజ్లర్ల ఆందోళన (Wrestlers Protest) మరింత తీవ్రరూపం దాల్చుతున్నది. బుధవారం అర్థరాత్రి పోలీసులు దీక్షా శిబిరంపై విరుచుకుపడి, ఆందోళనకారులను ఈడ్చిపారేయడంపై రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు విరుచుకుపడి, చేయి చేసుకున్నారని, తమను తోసేశారని వినేశ్‌ ఫొగట్‌ చెప్పారు.

ప్రభుత్వ చర్యలకు నిరసనగా తాను తనకు ఇప్పటి వరకూ వచ్చిన అన్ని పతకాలను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఎలాంటి వసతులు లేని దీక్షా శిబిరంలో ఉంటున్న ఆందోళనకారులకోసం ఆప్‌ నేత సోమనాథ్‌ భారతి ఫోల్డింగ్‌ బెడ్స్‌ తీసుకుని వచ్చారు. అయితే.. తమ అనుమతి లేకుండా వచ్చిన ఆప్‌ నేతలు పోలీసు బారికేడ్లను దాటుకుని లోపలికి వచ్చారంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజర్లపై దాడి చేసిన ఇద్దరు పోలీసులు మద్యం తాగి ఉన్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

పతకాలన్నీ ఇచ్చేస్తాం

‘ప్రభుత్వం ఇచ్చినవి, మేం అంతర్జాతీయ స్థాయిలో సాధించిన అన్ని పతకాలను వాపస్‌ చేస్తాం. ఈ అవమానాన్ని మేం ఇంకెంత భరించాలి? మమ్మల్ని అవమానిస్తున్నారు. నేలపై ఈడ్చిపడేశారు’ అని ఫొగట్‌ మీడియాకు చెప్పారు. బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసిన సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ తమను లైంగికంగా వేధించాడని పలువురు రెజ్లర్లు ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ‘ఫిర్యాదు చేసిన వారి పేర్లు చెప్పకూడదు. తాను మహిళా రెజ్లర్లను ఎలా పట్టుకున్నదీ, ఎలా హగ్‌ చేసుకున్నదీ టీవీ లైవ్‌లోనే చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు వెల్లడించారు.