యాదగిరిగుట్ట: కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాంగ్రెస్ నాయకులు పలువురు శనివారం మంత్రులు కేటీఆర్, జి.జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కాంగ్రెస్ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్, గౌళికార్ అరుణ, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ […]

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాంగ్రెస్ నాయకులు పలువురు శనివారం మంత్రులు కేటీఆర్, జి.జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కాంగ్రెస్ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్, గౌళికార్ అరుణ, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.