Yamuna | య‌మునా న‌ది మ‌హోగ్ర‌రూపం.. డేంజ‌ర్ మార్కును దాటి ప్ర‌వాహం! కేజ్రీవాల్ ఇంటి స‌మీపంలోకి వ‌ర‌ద నీరు

మూడు మీట‌ర్ల ఎత్తులో Yamuna | దేశ రాజ‌ధాని ఢిల్లీలో య‌మునా న‌ది ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ప్రవహిస్తోంది. డేంజ‌ర్ మార్కును దాటి మూడు మీట‌ర్ల ఎత్తులో న‌ది ప్ర‌వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో య‌మునా ప్ర‌వాహం గురువారం గ‌రిష్ట స్థాయికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర జ‌ల సంఘం అధికారులు అంచ‌నా వేస్తున్నారు. హ‌ర్యానాలోని హ‌త్నికుంద్ బ్యారేజీ నుంచి నీటిని విడుద‌ల చేయ‌డంతో య‌మునా న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. దీంతో గంట గంట‌కు య‌మునా న‌దిలో నీటి ప్ర‌వాహం పెరుగుతూనే […]

Yamuna | య‌మునా న‌ది మ‌హోగ్ర‌రూపం.. డేంజ‌ర్ మార్కును దాటి ప్ర‌వాహం! కేజ్రీవాల్ ఇంటి స‌మీపంలోకి వ‌ర‌ద నీరు

మూడు మీట‌ర్ల ఎత్తులో

Yamuna | దేశ రాజ‌ధాని ఢిల్లీలో య‌మునా న‌ది ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ప్రవహిస్తోంది. డేంజ‌ర్ మార్కును దాటి మూడు మీట‌ర్ల ఎత్తులో న‌ది ప్ర‌వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో య‌మునా ప్ర‌వాహం గురువారం గ‌రిష్ట స్థాయికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర జ‌ల సంఘం అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

హ‌ర్యానాలోని హ‌త్నికుంద్ బ్యారేజీ నుంచి నీటిని విడుద‌ల చేయ‌డంతో య‌మునా న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. దీంతో గంట గంట‌కు య‌మునా న‌దిలో నీటి ప్ర‌వాహం పెరుగుతూనే ఉంది. గురువారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో 208.46 మీట‌ర్ల వ‌ద్ద యమునా ప్ర‌వాహం కొన‌సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో మోన‌స్టీరి మార్కెట్, య‌మునా బ‌జార్, గ‌ర్హి మందు, గీతా ఘాట్, విశ్వ‌క‌ర్మ కాల‌నీ, ఖ‌ద్దా కాల‌నీ, నీలి చ‌త్రి టెంపుల్, ఓల్డ్ రైల్వే బ్రిడ్జి, నీమ్ క‌రోలితో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గీతా కాల‌నీలో ఉన్న స్మ‌శాన వాటిక‌లో వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆ స్మ‌శాన వాటిక‌ను మూసేశారు. క‌ర్‌క‌ర్‌దుమా, ఘాజిపూర్ స్మ‌శాన వాటిక‌ల్లో అంత్య‌క్రియ‌లు చేసుకోవాల‌ని సూచించారు.

నిన్న సాయంత్రం వ‌ర‌కు య‌మునా న‌ది 208.8 మీట‌ర్ల వ‌ద్ద ప్ర‌వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 45 ఏండ్ల క్రితం 207.49 మీట‌ర్ల వ‌ద్ద ప్ర‌వహించ‌గా, తాజాగా ఆ రికార్డు బ‌ద్ద‌లైంది. ప్ర‌స్తుతం 208.46 మీట‌ర్ల వ‌ద్ద య‌మునా ప్ర‌వహిస్తోంది. ఈ క్ర‌మంలో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. నిరాశ్ర‌యుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అధికారుల‌ను ఆదేశించారు.

యమునా.. మ‌హోగ్రరూపం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని యమునా న‌ది మ‌హోగ్రరూపం దాల్చింది. ఢిల్లీలోని ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం అయ్యాయి. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటి స‌మీపంలోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌టంతో.. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వ‌ద్ద య‌మునా న‌ది నీటిమ‌ట్టం ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. గురువారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యానికి య‌మునా నీటిమ‌ట్టం 208.51 మీట‌ర్ల‌కు చేరింది. ప్ర‌మాద‌క‌ర‌స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో య‌మునా ప్ర‌వ‌హిస్తోంది.

ఈ స్థాయిలో య‌మునా ప్ర‌వ‌హించ‌డం ఇదే తొలిసారి. 1978లో య‌మునా నీటిమ‌ట్టం 207.49 మీట‌ర్ల‌కు చేర‌డంతో ఢిల్లీలో భారీ వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాట‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. హర్యానాలోని హ‌త్నీకుంద్ ప్రాజెక్టు నుంచి నిరంత‌రంగా వ‌ర‌ద‌ను దిగువ‌కు విడుద‌ల చేస్తుండ‌టంతో య‌మునా నీటిమ‌ట్టం గంట గంట‌కు పెరుగుతోంది.

ఢిల్లీ వ్యాప్తంగా వ‌ర‌ద‌లు సంభ‌వించ‌డంతో అన్ని ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఇండ్ల‌లోకి నీరు చేర‌డంతో స్థానికులు ఇబ్బందులు ప‌డుతున్నారు. క‌శ్మీరీ గేటు – మంజు కా తిలానీ క‌లిపే ప్రాంతంలో భారీగా వ‌ర‌ద పోటెత్త‌డంతో వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

ఈ ప్రాంతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవ‌లం 500 మీట‌ర్ల దూరంలోనే ఉంది. ఢిల్లీ సెక్ర‌టేరియ‌ట్‌లోకి వ‌ర‌ద నీరు చేరింది. భారీ వ‌ర‌ద‌ల దృష్ట్యా ఢిల్లీలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ఆదివారం వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి. ప‌లు ప్రాంతాల్లో తాగునీటి కొర‌త ఏర్ప‌డింది. య‌మునా బ్యాంక్ మెట్రో స్టేష‌న్‌ను మూసివేశారు