Delhi | ఢిల్లీలో జలప్రళయం.. సుప్రీంకోర్టు చేరిన వరద నీరు
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ నిండు కుండలా మారింది. నిన్న యమునా డేంజర్ మార్కును దాటి మూడు మీటర్ల ఎత్తులో ప్రవహించిన సంగతి తెలిసిందే. అయితే యమునాకు వరద పోటెత్తడంతో.. నిన్ననే ఎర్రకోటను చేరింది వరద నీరు. తాజాగా సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌ను వరద నీరు తాకింది. రాజ్‌ఘాట్ కూడా నీట మునిగింది. భారీ వరదల నేపథ్యంలో దేశ రాజధానిలో తాగునీటి సరఫరాతో పాటు పలు చోట్ల విద్యుత్ […]

Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ నిండు కుండలా మారింది. నిన్న యమునా డేంజర్ మార్కును దాటి మూడు మీటర్ల ఎత్తులో ప్రవహించిన సంగతి తెలిసిందే. అయితే యమునాకు వరద పోటెత్తడంతో.. నిన్ననే ఎర్రకోటను చేరింది వరద నీరు. తాజాగా సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌ను వరద నీరు తాకింది. రాజ్‌ఘాట్ కూడా నీట మునిగింది. భారీ వరదల నేపథ్యంలో దేశ రాజధానిలో తాగునీటి సరఫరాతో పాటు పలు చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ అంతా వరద నీరు నిలిచిపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. స్మశాన వాటికలను మూసేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు 208. 46 మీటర్ల వద్ద యమునా నది ప్రవాహం కొనసాగింది. నిన్న రాత్రి 208.66 మీటర్ల వద్ద కొనసాగింది. క్రమక్రమంగా యమునా నది నీటి మట్టం తగ్గుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 208.30 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.
వరదలపై ప్రధాని మోదీ ఆరా
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వరదలపై ఆరా తీశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరో 24 గంటల్లో వరద తగ్గే అవకాశం ఉందని మోదీకి అమిత్ షా చెప్పినట్లు సమాచారం. భారీ వరదల నేపథ్యంలో ఢిల్లీలోకి భారీ వాహనాలను అనుమతించడం లేదు. నిత్యవసరాలను తరలిస్తున్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
యమునాకు వరద పోటెత్తడం, ఢిల్లీ నిండు కుండలా మారడంతో.. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 23,692 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 21,092 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ల కింద నివాసం ఉంటున్నారు. 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 1,022 మందిని రక్షించారు.