అధికార భాషా సంఘం అధ్యక్షుడు ‘యార్లగడ్డ’ రాజీనామా

విధాత: విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ పేరు మార్చి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్శిటీగా పెట్ట‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంద‌న్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదన్న‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర‌స‌న‌గా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాగా ఈ విష‌యంపై తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే మండ‌లిలో తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం […]

  • By: krs    latest    Sep 21, 2022 8:32 AM IST
అధికార భాషా సంఘం అధ్యక్షుడు ‘యార్లగడ్డ’ రాజీనామా

విధాత: విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ పేరు మార్చి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్శిటీగా పెట్ట‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంద‌న్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదన్న‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర‌స‌న‌గా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాగా ఈ విష‌యంపై తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే మండ‌లిలో తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.