ఆనం ఫ్యాకప్ ఐనట్టేనా.. TDP వైపు పయనమేనా!
విధాత: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. కాంగ్రెస్ లో పలు పదవులు అనుభవించి టిడిపిలో ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ వైసీపీలో ఎమ్మెల్యేగా మాత్రమే ఉండడాన్ని తట్టుకోలేక పరిపరివిధాల సొంత పార్టీ.. సొంత ప్రభుత్వం మీద కామెంట్లు చేసిన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ షెడ్యూల్ ముగిసినట్లే ఉంది. కొత్త ప్రయాణం మళ్ళీ టిడిపి వైపు తప్పేలా లేదు. ఇప్పటికే ఆయన్ను వెంకటగిరి ఇంచార్జ్ గా తప్పించిన జగన్ అక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి […]

విధాత: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. కాంగ్రెస్ లో పలు పదవులు అనుభవించి టిడిపిలో ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ వైసీపీలో ఎమ్మెల్యేగా మాత్రమే ఉండడాన్ని తట్టుకోలేక పరిపరివిధాల సొంత పార్టీ.. సొంత ప్రభుత్వం మీద కామెంట్లు చేసిన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడ షెడ్యూల్ ముగిసినట్లే ఉంది.
కొత్త ప్రయాణం మళ్ళీ టిడిపి వైపు తప్పేలా లేదు. ఇప్పటికే ఆయన్ను వెంకటగిరి ఇంచార్జ్ గా తప్పించిన జగన్ అక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. అంటే ఆయనకే టికెట్ ఇస్తున్నట్లు జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా సెక్యూరిటీని సైతం కుదించేశారు.
ఇదిలా ఉండగా రామ్ నారాయణ రెడ్డి ఇంకా కంట్రోల్‌లో ఉంటారేమో అనుకుంటున్న తరుణంలో ఆయన టిడిపి వైపు చూస్తున్నారన్న వేగుల సమాచారంతో జగన్ ఇంకో వేటు వేశారు. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమం నుంచి కూడా ఆయన్ను బయటకు పంపేశారు.
ఇంత వరకూ మీరు చేసిన సాయంచాలు.. ఇక దయచేయండి అని పార్టీ ఆయనకు చెప్పేయడంతోబాటు ఆ కార్యక్రమానికి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించింది. అంటే ఇంకా ఆనం ఫ్యాకప్ చెప్పాల్సిన సమయం వచ్చిందని స్పష్టం అవుతోంది.
వాస్తవానికి ఇటీవల సొంత ప్రభుత్వంపై ఆనం రామనారాయణరెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన హద్దులు దాటినా.. సీఎం జగన్ చూసీ చూడనట్టు ఉన్నారు. ఆ తరువాత ఆనం మరింత రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలు ఎంత త్వరగా వస్తే, తాము అంత వేగంగా ఇంటికి వెళ్తామంటూ కామెంట్స్ చేశారు.
అభివృద్ధి పనులేవీ జరగడం లేదని, జనం అడిగితే ఏం చెప్పాలంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా మాట్లాడారు. దీంతో జగన్ సీరియస్ అయ్యారు. ఒక్కొక్కటిగా ఆయన కవచాలను.. పదవులను తొలగిస్తూ వస్తున్నారు. తానొక సీనియర్ నేతనని, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అక్కసుతో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్ సహనాన్ని ఆనం పరీక్షించారు.
చివరకు ఇలా ఒంటరిగా మిగిలారు. ఇదిలా ఉండగా ఆయన టీడీపీలోకి వెళ్తారని అంటున్నారు. త్వరలోనే చంద్రబాబుతో భేటి అవుతారని.. ఒక ఎమ్మెల్యే..ఒక ఎంపీ టికెట్ ఇచ్చేలా బేరాలు సాగుతున్నాయని సమాచారం.