బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు.. వైఎస్ షర్మిల?

విధాత, సినిమా: ‘ఆహా’లో నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా రన్ అవుతోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ బీభత్సమైన ఆదరణతో.. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. బాలయ్య చెప్పినట్లుగా టాక్ షోలలో అమ్మా మొగుడుగా ఈ షో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. మొదటి సీజన్‌తో ఓ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ షో.. రీసెంట్‌గా రెండో సీజన్‌ను ప్రారంభించుకుంది. అయితే ఈ సీజన్‌లో కాస్త ట్రెండ్ మార్చారు. మొదటి సీజన్‌కి కేవలం సినిమా సెలబ్రిటీలపైనే ఫోకస్ చేసిన […]

  • By: krs    latest    Nov 03, 2022 5:33 PM IST
బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు.. వైఎస్ షర్మిల?

విధాత, సినిమా: ‘ఆహా’లో నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా రన్ అవుతోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ బీభత్సమైన ఆదరణతో.. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. బాలయ్య చెప్పినట్లుగా టాక్ షోలలో అమ్మా మొగుడుగా ఈ షో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. మొదటి సీజన్‌తో ఓ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ షో.. రీసెంట్‌గా రెండో సీజన్‌ను ప్రారంభించుకుంది.

అయితే ఈ సీజన్‌లో కాస్త ట్రెండ్ మార్చారు. మొదటి సీజన్‌కి కేవలం సినిమా సెలబ్రిటీలపైనే ఫోకస్ చేసిన ఆహా టీమ్.. అదేనండి మన అల్లు అరవింద్‌గారు.. ఈసారి ఈ షోకి పొలిటికల్ టచ్ కూడా యాడ్ చేశారు. అది మొదటి ఎపిసోడ్‌తోనే నిరూపించారు. ఈ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌తో హాజరైన విషయం తెలిసిందే.

ఇలాంటి షో లకు హాజరవడం చంద్రబాబుకి కూడా ఫస్ట్ టైమ్. అదీ కూడా బాలయ్య హోస్ట్ కాబట్టే ఇది సాధ్యమైంది. చంద్రబాబు వచ్చిన ఎపిసోడ్.. ‘ఆహా’ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. భారీ ఆదరణ ఆ ఎపిసోడ్ పొందింది. ఇప్పుడు మళ్లీ సినిమా సెలబ్రిటీల ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. అయితే, తాజాగా ఈ షోకు సంబంధించి ఒక అణుబాంబు లాంటి వార్త సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

NTR 30: ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా?

అదేంటని అనుకుంటున్నారా? ప్రస్తుతం సెలబ్రిటీలతో రన్ అవుతోన్న ఈ షోకి.. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గెస్ట్‌గా రాబోతోందట. వినడానికే షాకింగ్‌గా ఉంది కదా. ఎందుకంటే.. బాలయ్య కూడా ఓ పొలిటికల్ లీడర్. హిందూపురం ఎమ్మెల్యే. అధికారంలో ఉన్న షర్మిల అన్న పార్టీకి వ్యతిరేకమైన పార్టీలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి.. షర్మిలను క్వశ్చన్స్ వేయడం, ఆమె సమాధానం చెప్పడం చూసే వారికి మాంచి మజా వస్తుంది కానీ.. కొందరికి మాత్రం ఇది కడుపు మండిపోయే విషయమనే చెప్పుకోవాలి.

ఆ కొందరు ఎవరో కాదు.. వైఎస్ జగన్ అండ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలు. ఎందుకంటే.. జగన్‌కు, షర్మిలకు ప్రస్తుతం పడటం లేదు. ఆమె ఏపీ వదిలేసి.. తెలంగాణలో వైఎస్ పేరుతో పార్టీ పెట్టి.. ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ షో‌లో బాలయ్య.. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఏవైనా సీక్రెట్స్ రాబడితే.. అది జగన్‌పై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పటికే షర్మిల విషయంలో జగన్‌ను ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. అలాంటిది ఆమె ఈ షోకి వచ్చిందంటే.. ఖచ్చితంగా జగన్‌కి డ్యామేజ్ జరగడం ఖాయం.

ఆంధ్రప్రదేశ్ ‘నంది’.. తెలంగాణ ‘సింహ’ అవార్డులేమయ్యాయ్!

అలాగే.. ఆమె రావడం వల్ల ‘ఆహా’కు మంచి రేటింగ్ వస్తుందేమో కానీ.. జగన్‌తో పాటు బాలయ్యకు కూడా కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, మధ్యలో ఆమె కనుక బెల్లంకొండ సీన్ విషయంలో నాన్నగారు మీకు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు కదా.. అందంటే.. బాలయ్య ఇమేజ్ బద్దలైనట్లే.

అయితే ఆమె నిజంగా అన్నా.. ఎడిటింగ్‌లో ఎలాగూ తీసేస్తారు కాబట్టి.. బాలయ్య పరంగా.. ఆమె విషయం ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే.. అసలామె ఈ షోకి వస్తుందా? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో అయితే వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. ‘ఆహా’ సైడ్ నుంచి మాత్రం ఎటువంటి క్లూస్ కూడా బయటికి రాలేదు. చూద్దాం.. ఏం జరగబోతోందో?.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..