Zimbabwe:పాపం.. జింబాబ్వే ఆశలు గల్లంతు.. పసికూన దెబ్బకు ప్రపంచ కప్ నుండి ఔట్..!
Zimbabwe: మరి కొద్ది రోజులలో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుండగా, దీనికి ముందు క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లు మంచి మజాని అందిస్తున్నాయి. మొన్నటికి మొన్న రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌కు వరల్డ్ కప్‌లో చోటు లేకుండా చేసిన పసికూన స్కాట్‌లాండ్.. ఇప్పుడు జింబాబ్వేకు కూడా కోలుకొని షాకిచ్చింది. వరల్డ్ కప్‌లో అడుగుపెట్టాలనే కలలని ఆవిరి చేసింది. మిగతా జట్లతో అత్యద్భుతంగా ఆడిన జింబాబ్వే స్కాట్లాండ్ ముందు చేతులెత్తేసింది. దీంతో మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో […]

Zimbabwe: మరి కొద్ది రోజులలో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుండగా, దీనికి ముందు క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లు మంచి మజాని అందిస్తున్నాయి. మొన్నటికి మొన్న రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌కు వరల్డ్ కప్‌లో చోటు లేకుండా చేసిన పసికూన స్కాట్‌లాండ్.. ఇప్పుడు జింబాబ్వేకు కూడా కోలుకొని షాకిచ్చింది. వరల్డ్ కప్‌లో అడుగుపెట్టాలనే కలలని ఆవిరి చేసింది. మిగతా జట్లతో అత్యద్భుతంగా ఆడిన జింబాబ్వే స్కాట్లాండ్ ముందు చేతులెత్తేసింది. దీంతో మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో జింబాబ్వే దారుణమైన పరాజయం సాధించింది.
జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.ఇక 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే కేవలం 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌట్ అయింది. విజయం దిశగా పయనిస్తుందని, ఈ సారి జింబాబ్వే వరల్డ్ కప్‌లో అడుగు పెట్టడం ఖాయమని అనుకుంటున్న సమయంలో వరుస పెట్టి వికెట్స్ కోల్పోవడంతో దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. ర్యాన్ బురి (83), వెస్లీ మద్వీర్ (40) మాత్రమే జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా, మిగతా వారందరు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో ప్రపంచకప్ ఆశలు పూర్తిగా నీరుగారిపోయాయి.
ఇటీవల శ్రీలంక వరల్డ్ కప్ బెర్త్ కన్‌ఫాం చేసుకోగా, ఇంకో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. తుది సమరంలో ఈ రెండు జట్టు పోటీ పడనుండగా, నెదర్లాండ్స్ అడుగుపెట్టాలంటే భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. సాధారణ విజయం దక్కిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. స్కాట్లాండ్ జట్టు మంచి రన్‌రేట్‌తో ఉంది. వెస్టిండీస్, జింబాబ్వే వంటి మంచి జట్లని మట్టి కరిపించిన స్కాట్లాండ్‌కి నెదర్లాండ్స్ ని ఓడించడం పెద్ద సమస్యే కాదు. దాదాపు స్కాట్లాండ్ ప్రపంచ బర్త్ కన్‌ఫాం చేసుకున్నట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు.