World Beer Awards | ‘వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025’ లో ఛీర్స్​ కొట్టిన భారత బీర్లు

ఇంతవరకు “చల్లని బీర్” అంటే జర్మన్, బెల్జియన్, అమెరికన్ బ్రాండ్స్‌నే గుర్తొచ్చేవి. కానీ ఈసారి వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025లో కింగ్‌ఫిషర్, సింబా బీర్స్ పతకాలు దక్కించుకోవడంతో… “మేం కూడా ఉన్నాం రా!” అని గ్లాసులు ఎత్తేశాయి. భారత క్రికెట్, సినిమా తర్వాత… ఇప్పుడు బీర్ కూడా ప్రపంచ వేదికపై మెరిసింది

World Beer Awards | ‘వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025’ లో ఛీర్స్​ కొట్టిన భారత బీర్లు

 

  • కింగ్‌ఫిషర్, సింబా బీర్లకు అంతర్జాతీయ గుర్తింపు
  • జర్మనీ, బెల్జియం వాళ్లకీ షాక్ – “ఇండియన్ బీర్ గెలిచిందా?!”
  • ఇక నుంచి “ఆత్మనిర్భర్​ భారత్”​లో బీర్​ కూడా..

ప్రపంచవ్యాప్తంగా బీర్ పరిశ్రమలో పేరొందిన వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025లో భారత బీర్ బ్రాండ్స్ ఘన విజయం సాధించాయి. యూరప్, అమెరికా వంటి దేశాల ప్రాచీన బ్రూవరీస్‌తో పోటీ పడుతూ, కింగ్‌ఫిషర్ మరియు సింబా బీర్స్ అనేక కేటగిరీల్లో పతకాలు సాధించాయి. ఈ విజయం భారత బ్రూవరీస్ అంతర్జాతీయ స్థాయిలో నిలబడగల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది.

🏅 గెలుపొందిన భారత బ్రాండ్స్
Winners of World Beer Awards 2025 - Kingfisher Ultra , Kingfisher Strong , Kingfisher Premium, Kingfisher Ultra Max, Simba Wit, Simba Stout

Version 1.0.0

  • Kingfisher Ultra (International Lager Style) – స్వర్ణ పతకం
    స్పష్టమైన గోల్డెన్ కలర్, తేలికపాటి లెమన్‌గ్రాస్ & మాల్ట్ సువాసన, స్మూత్ ఫినిష్.
  • Kingfisher Strong (Seasonal: Oktoberfestbier/Marzen) – రజత పతకం
    తేలికపాటి సిట్రస్ టచ్, పైనీ హాప్స్, డ్రై బిట్టర్ ఫినిష్.
  • Kingfisher Premium (Helles/Münchner Lager) – రజత పతకం
    క్లాసిక్ పేల్ లాగర్, ఫ్లోరల్-సిట్రస్ నోట్‌లు, రిఫ్రెషింగ్ మైల్డ్ ఫినిష్.
  • Kingfisher Ultra Max (Seasonal: Maibock/Helles Bock) – కాంస్య పతకం
    హై స్ట్రెంగ్త్ లాగర్, స్వీట్ మాల్ట్, ఫ్లోరల్ హాప్ టేస్ట్.
  • Simba Wit (Belgian-Style Wheat Beer) – రజత పతకం
    ఆరెంజ్ పీల్, కొరియాండర్‌తో చేసిన విత్‌బీర్, వైబ్రంట్ సిట్రస్ అరోమా.
  • Simba Stout (Dry Stout) – కాంస్య పతకం
    డార్క్ కలర్, చాక్లెట్ & కాఫీ నోట్స్, క్రీమీ టెక్స్చర్, మైల్డ్ బిట్టర్ ఫినిష్.
🍺 అవార్డుల ప్రాధాన్యం

వరల్డ్ బీర్ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇందులో పాల్గొనే బీర్లను బ్రాండింగ్ లేకుండా బ్లైండ్ టెస్టింగ్లో నిపుణులు రుచి చూస్తారు. అంటే పేరు కాకుండా, నాణ్యత, స్టైల్, రుచి ఆధారంగానే అవార్డు ఇస్తారు.

ఈ గుర్తింపు వల్ల:

  • భారత బీర్స్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానం పెరుగుతుంది.
  • దేశీయ కస్టమర్లకు కూడా “Made in India Beers”పై విశ్వాసం పెరుగుతుంది.
  • సింబా, కింగ్‌ఫిషర్ వంటి బ్రాండ్స్ గ్లోబల్ స్థాయిలో కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు ఏర్పడతాయి.

వరల్డ్ బీర్ అవార్డ్స్ 2025లో భారత బ్రూవరీస్ సాధించిన ఈ విజయం, దేశీయ బీర్ పరిశ్రమకు ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు యూరోపియన్, అమెరికన్ బ్రాండ్స్ ఆధిపత్యం ఉన్న ఈ వేదికపై ఇప్పుడు భారత బీర్స్ కూడా నిలబడ్డాయి. సింబా, కింగ్‌ఫిషర్ విజయాలు భవిష్యత్తులో మరిన్ని భారత బ్రాండ్స్ అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు దారి తీస్తాయి.

ఇంతకీ మన సూపర్​స్టార్​ కింగ్‌ఫిషర్ “స్ట్రాంగ్”కి గోల్డ్ ఎందుకు రాలేదా అని అడిగితే… జడ్జీలు బహుశా రాత్రి పొద్దుపోయే వరకు టేస్ట్ చేసి ఉంటారేమో! 😅