China Victory Day Parade | చైనా విజయోత్సవ పరేడ్‌ – ప్రచండ ఆయుధాలతో ప్రపంచానికే సవాల్

బీజింగ్‌లో జరిగిన చైనా విజయోత్సవ పరేడ్‌లో DF-5C, DF-61 ICBM, JL-3 సబ్‌మెరైన్ మిసైల్, హైపర్‌సోనిక్ యాంటీ-షిప్ మిసైళ్ల వంటి భారీ ఆయుధాలు ప్రదర్శించింది. పుతిన్, కిమ్ జాంగ్ ఉన్, ఇతర ప్రపంచ నేతలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

China Victory Day Parade | చైనా విజయోత్సవ పరేడ్‌ – ప్రచండ ఆయుధాలతో ప్రపంచానికే సవాల్

బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ బుధవారం  ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ పరేడ్  చైనా తన సైనిక శక్తిని ఘనంగా ప్రదర్శించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించగా, ప్రత్యేక అతిథులుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాన్టో సహా పలు దేశాధినేతలు పాల్గొన్నారు.

People’s Liberation Army soldiers march past Tiananmen Square during China’s Victory Day parade.

చాలా ఖచ్చితమైన దర్శకత్వంలో జరిగిన ఈ ప్రదర్శనలో చైనా అణు సామర్థ్యం కలిగిన ఖండాతర అణు క్షిపణులు (ICBMs), హైపర్‌సోనిక్ మిసైళ్లు, నావికా రక్షణ వ్యవస్థలు వంటి ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది. “మానవాళి శాంతి లేదా యుద్ధం అనే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది” అని షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం ఈ పరేడ్‌లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

పరేడ్ ప్రధానాంశాలు:

China’s new DF-61 intercontinental ballistic missile carried on mobile platform at Beijing Victory Day parade.

  • సైనిక గౌరవ వందనం: కార్యక్రమం ప్రారంభంలో 80 గన్ సల్యూట్‌తో పాటు చైనా జెండా ఆవిష్కరించారు. షీ జిన్‌పింగ్ ఓపెన్ కార్‌లో సైనిక దళాల వందనాన్ని స్వీకరించారు.
  • DF-61 ఆవిష్కరణ: మొబైల్ ప్లాట్‌ఫామ్‌ నుంచి ప్రయోగించగల కొత్త తరహా ICBM. దీని పరిధి పాత మోడళ్లకు మించి 12,000 కి.మీ. వరకు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
  • త్రిముఖ అణు సామర్థ్యం: భూభాగం నుంచి DF-61, గగనతలం నుంచి JL-1, సముద్రం నుంచి JL-3 క్షిపణుల ప్రదర్శన. దీని ద్వారా చైనా అణు శక్తి భూ–వాయు–జల మార్గాలన్నింటినీ కవర్ చేస్తుందని స్పష్టమైంది.
  • హైపర్‌సోనిక్ యుద్ధ సామర్థ్యం: YJ-15, YJ-17, YJ-19, YJ-20 వంటి దీర్ఘశ్రేణి యాంటీ-షిప్ హైపర్‌సోనిక్ మిసైళ్లు ప్రదర్శన. ఇవి ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో యుఎస్ నేవీ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
  • నావికా రక్షణదళం: HQ-16C, HQ-10A నావికా ఇంటర్‌సెప్టర్ సిస్టమ్స్ కూడా పరేడ్‌లో ప్రదర్శన.

కాగా, ఈ పరేడ్‌లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది డాంగ్‌ఫెంగ్–5C (DF-5C) ఖండాంతర అణు క్షిపణి (ICBM).

China’s DF-5C intercontinental ballistic missile displayed in three modular sections during Victory Day parade in Beijing, September 2025.

నిపుణుల అంచనాల ప్రకారం ఈ కొత్త తరం క్షిపణి ప్రపంచంలోని ఏ మూలకైనా చేరగల సామర్థ్యం కలిగి ఉంది. 20,000 కి.మీ.కు మించి ఉండే పరిధి, హైపర్‌సోనిక్ వేగం, 10 వరకు అణు వార్‌హెడ్‌లను మోయగల MIRV వ్యవస్థలు దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణులలో నెం.1గా నిలబెట్టాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో చైనా, అమెరికా మరియు పాశ్చాత్య దేశాలకు బలమైన సంకేతం పంపింది. “ప్రపంచ భద్రతా సమీకరణాలలో మేమే కీలకం” అని బీజింగ్ స్పష్టంగా చాటిచెప్పింది.

DF-5C సాంకేతిక ప్రత్యేకతలు

Large warhead of China’s DF-5C ICBM showcased separately, highlighting multi-megaton payload capability.

DF-5C క్షిపణి పూర్వ తరం DF-5 సిరీస్ మరియు ఆధునిక DF-41 సాంకేతికతలను సమీకరించి రూపొందించబడింది. దీని విశిష్టతలు ఇలా ఉన్నాయి:

  • అత్యధిక పరిధి: 20,000 కి.మీ.కు పైగా, భూమ్మీద ఎక్కడికైనా చేరగల సామర్థ్యం.
  • హైపర్‌సోనిక్ వేగం: “టెన్స్ ఆఫ్ మాక్” వేగంతో ప్రయాణం – క్షిపణి రక్షణ వ్యవస్థలకు ప్రతిస్పందించడానికి తగిన సమయం ఉండదు.
  • MIRV (Multiple Independently targetable Re-entry Vehicle) సామర్థ్యం: ఒకేసారి 10 వరకు వార్‌హెడ్‌లు మోసుకెళ్లగలదు. వీటిలో అణు, సాధారణ లేదా డీకాయ్ వార్‌హెడ్‌లు ఉండవచ్చు.
  • మోడ్యూలర్ డిజైన్: మూడు భాగాలుగా విభజించి ప్రత్యేక వాహనాలపై రవాణా చేయగల నిర్మాణం. ఇది సంసిద్ధతా  సమయాన్ని తగ్గిస్తుంది.
  • ద్రవ ఇంధనం: అధిక thrust ఇస్తుంది. అయితే నిల్వ, రవాణా సమస్యాత్మకం.
  • మార్గదర్శక వ్యవస్థ: ఇనర్షియల్ గైడెన్స్, స్టార్‌లైట్ సిస్టమ్, బైదూ ఉపగ్రహ నావిగేషన్ మిళితం. దీని వలన 20,000 కి.మీ. దూరంలో కూడా మధ్యశ్రేణి క్షిపణిలా ఖచ్చితత్వం.

వ్యూహాత్మక ప్రాధాన్యం

DF-5C కేవలం సాంకేతిక అద్భుతం మాత్రమే కాదు, అంతర్జాతీయ వ్యూహాత్మక సమీకరణాలను ప్రభావితం చేసే ఉపకరణం కూడా.

  • అమెరికాకు సవాల్: అమెరికా అంచనాల ప్రకారం 2030 నాటికి చైనా వద్ద 1,000 అణు వార్‌హెడ్‌లు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు DF-5C రూపంలో బీజింగ్ ఆ దిశగా వేగంగా పయనిస్తున్నదనే సంకేతం ఇచ్చింది.
  • సమాఖ్య ప్రదర్శన: రష్యా, ఉత్తర కొరియా నేతల సమక్షంలో ఈ క్షిపణిని ప్రదర్శించడం ద్వారా చైనా ఒక రకంగా అణు కూటమి బలోపేతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
  • ప్రజలకు సందేశం: చరిత్రను మరువొద్దని, ఇంకా భద్రతా సవాళ్లు కొనసాగుతున్నాయని, దేశరక్షణ కోసం శక్తివంతమైన ఆయుధాలు తప్పనిసరి అని ప్రజలకు గుర్తు చేసింది.

అమెరికా – రష్యా ICBMల‌తో పోలిక

  • పరిధి: అమెరికా, రష్యా ICBMs గరిష్టంగా 11,000–15,000 కి.మీ. పరిధి కలిగివుంటే, DF-5C 20,000 కి.మీ. మించిపోయింది.
  • వార్‌హెడ్ శక్తి: అమెరికా–రష్యా అతిపెద్ద వార్‌హెడ్‌లు 750 కిలోటన్ నుండి 1 మెగాటన్ వరకు ఉండగా, DF-5C మల్టీ మెగాటన్ సామర్థ్యం కలిగిన వార్‌హెడ్‌ను మోయగలదని విశ్లేషకులు చెబుతున్నారు.
  • సాంకేతిక ఆధునికత: పాత DF-5 శ్రేణిని DF-41 తరహా ఆధునిక సాంకేతికతతో సమీకరించడం వల్ల మరింత ఖచ్చితత్వం, తక్కువ సిద్ధత సమయం సాధ్యమైంది.

China’s People’s Liberation Army showcases LY-1 vehicle-mounted laser weapon systems during Victory Day military parade in Beijing, September 2025.

చైనా అణు సిద్ధాంతం

చైనా ఎప్పటిలాగే తన “No First Use” విధానాన్ని పునరుద్ఘాటించింది. “మేము ముందుగా అణ్వాయుధాలను వాడము. కానీ ఎవరైనా మాకు అణు ముప్పు కలిగిస్తే, ప్రతిస్పందనకు సిద్ధం” అని స్పష్టం చేసింది.
చైనా ఎల్లప్పుడూ తన అణు శక్తిని అవసరమైన కనీస స్థాయిలోనే ఉంచుతామని, అణ్వాయుధ పోటీలో పాల్గొనబోమని కూడా పేర్కొంది. అయినప్పటికీ, DF-5C రూపకల్పన వాస్తవానికి అంతకుమించిన శక్తిని ప్రతిబింబిస్తోంది.

DF-5C ఆవిష్కరణతో చైనా తన అణు శక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్షిపణి కేవలం ఒక ఆయుధం కాదు — ప్రపంచ భద్రతా సమీకరణాన్ని మార్చగల పెనుసవాల్. ముఖ్యంగా అమెరికాకు నిద్రపట్టనివ్వని ఆయుధం.