రెయిలింగ్ ఎక్కేందుకు మొస‌లి ప్ర‌య‌త్నం.. ఏం జ‌రిగిందో తెలుసా..? వీడియో

నీళ్ల‌లో ఉండే మొస‌లి.. ఫుత్‌పాత్‌పై ప్ర‌త్య‌క్ష‌మైంది. అదేదో చిన్న మొస‌లి కూడా కాదు.. 10 ఫీట్ల పొడ‌వు ఉంది. ఇక ఫుట్‌పాత్‌పై ఉన్న మొస‌లి.. ప‌క్క‌నే ఉన్న నీటిలోకి వెళ్లేందుకు వ్య‌య‌ప్రయాసాలు ప‌డింది. దాదాపు ఐదారు అడుగుల ఎత్తులో ఉన్న రెయిలింగ్‌పైకి ఎక్కేందుకు య‌త్నించింది.

రెయిలింగ్ ఎక్కేందుకు మొస‌లి ప్ర‌య‌త్నం.. ఏం జ‌రిగిందో తెలుసా..? వీడియో

నీళ్ల‌లో ఉండే మొస‌లి.. ఫుత్‌పాత్‌పై ప్ర‌త్య‌క్ష‌మైంది. అదేదో చిన్న మొస‌లి కూడా కాదు.. 10 ఫీట్ల పొడ‌వు ఉంది. ఇక ఫుట్‌పాత్‌పై ఉన్న మొస‌లి.. ప‌క్క‌నే ఉన్న నీటిలోకి వెళ్లేందుకు వ్య‌య‌ప్రయాసాలు ప‌డింది. దాదాపు ఐదారు అడుగుల ఎత్తులో ఉన్న రెయిలింగ్‌పైకి ఎక్కేందుకు య‌త్నించింది. కానీ సాధ్య‌ప‌డ‌లేదు. రెయిలింగ్ నుంచి కింద ప‌డిపోయింది మొస‌లి. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్‌లోని న‌రోరా ఘాట్ వ‌ద్ద గంగా న‌దిలో నుంచి ఆ మొస‌లి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తానికి ఫుట్ పాత్ మీద‌కు వ‌చ్చిన మొస‌లి మ‌ళ్లీ నీటిలోకి వెళ్లేందుకు య‌త్నించింది. ఈ దృశ్యాల‌ను స్థానికులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

అక్క‌డికి చేరుకున్న‌ అట‌వీశాఖ అధికారులు.. తాళ్ల స‌హాయంతో మొస‌లిని బంధించారు. అనంత‌రం దాన్ని గంగా న‌దిలో వ‌దిలేశారు. అయితే మొస‌లిని బంధించేందుకు అధికారులు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.