Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు సెల‌వులే సెల‌వులు.. ప‌ని దినాలు 15 రోజులే..!

Bank Holidays | విధాత: కొత్త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ (Financial Year) ప్రారంభానికి ఇక మూడు రోజుల గ‌డువే మిగిలి ఉంది. అయితే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే ఏప్రిల్ నెల‌లో బ్యాంకుల‌కు (Banks) సెల‌వులే సెలవులు ఉండనున్నాయి. మొత్తం 30 రోజుల్లో కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే ప‌ని దినాలు ఉన్నాయి. నిత్యం లావాదేవీలు జరిపేవారు, బ్యాంకు అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపే వారు సెలవుల గురించి తెలుసుకుంటే మంచిది. ఇక ఏప్రిల్ ఒక‌టో తేదీన అకౌంట్స్ […]

Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు సెల‌వులే సెల‌వులు.. ప‌ని దినాలు 15 రోజులే..!

Bank Holidays |

విధాత: కొత్త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ (Financial Year) ప్రారంభానికి ఇక మూడు రోజుల గ‌డువే మిగిలి ఉంది. అయితే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే ఏప్రిల్ నెల‌లో బ్యాంకుల‌కు (Banks) సెల‌వులే సెలవులు ఉండనున్నాయి. మొత్తం 30 రోజుల్లో కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే ప‌ని దినాలు ఉన్నాయి.

నిత్యం లావాదేవీలు జరిపేవారు, బ్యాంకు అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపే వారు సెలవుల గురించి తెలుసుకుంటే మంచిది. ఇక ఏప్రిల్ ఒక‌టో తేదీన అకౌంట్స్ క్లోజింగ్ డే (Accounts Closing Day) సంద‌ర్భంగా ప‌లు రాష్ట్రాల్లో బ్యాంకుల‌కు సెల‌వులు (Bank Holidays) ప్ర‌క‌టించారు.

మ‌రుస‌టి ఆదివారం రోజు కావ‌డంతో.. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే 2 సెల‌వులు వ‌చ్చాయి. మొత్తంగా ఐదు ఆదివారాలు, రెండో-నాలుగో శ‌నివారంతోపాటు దేశ‌వ్యాప్తంగా 15 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఇక అంబేద్క‌ర్ జ‌యంతి, బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి, మ‌హావీర్ జ‌యంతి, రంజాన్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా బ్యాంకుల‌కు సెల‌వు.

బ్యాంకుల‌కు సెల‌వులు ఇవే..

ఏప్రిల్ 1(శ‌నివారం) అకౌంట్స్ క్లోజింగ్ డే
ఏప్రిల్ 2 (ఆదివారం)
ఏప్రిల్ 4 (మంగ‌ళ‌వారం) మ‌హావీర్ జ‌యంతి
ఏప్రిల్ 5 (బుధ‌వారం) బాబు జ‌గ్జీవ‌న్ రాం జ‌యంతి
ఏప్రిల్ 7 (శుక్ర‌వారం) గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 8 (శ‌నివారం) రెండో శ‌నివారం
ఏప్రిల్ 9(ఆదివారం)
ఏప్రిల్ 14 (శుక్ర‌వారం) బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి
ఏప్రిల్ 15 (శ‌నివారం) హిమాచ‌ల్ దినోత్స‌వం (ప‌లు రాష్ట్రాల్లో సెల‌వు)
ఏప్రిల్ 16 (ఆదివారం)
ఏప్రిల్ 18 (మంగ‌ళ‌వారం) షాబ్ ఈ- ఖ‌ద‌ర్ (జ‌మ్ముక‌శ్మీర్‌)
ఏప్రిల్ 21 (శుక్ర‌వారం) రంజాన్
ఏప్రిల్ 22 (శ‌నివారం) నాలుగో శ‌నివారం
ఏప్రిల్ 23 (ఆదివారం)
ఏప్రిల్ 30 (ఆదివారం)