Asaduddin Owaisi | వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై అనుమానాలు.. కేంద్రంపై ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తేనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అనుమానలున్నాయని, తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ స్పష్టం చేశారు

విధాత, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తేనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అనుమానలున్నాయని, తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ భేటీలో వక్ఫ్‌బోర్డు బిల్లుకు 40 సవరణలు ప్రతిపాదించిందన్నారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బిల్లుపై లీకులిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు.
వక్స్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. వక్స్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉందన్నారు. వారికి హిందూత్వ అజెండా ఉందని.. వక్స్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వక్స్ బోర్డుకు చాలా చోట్ల దర్గాలు ఉన్నాయని, ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తాము వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.