Jharkhand | జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ పట్టాలు
Jharkhand | రాంచీ : జార్ఖండ్( Jharkhand )లో దారుణం జరిగింది. సాహిబ్‌గంజ్( Sahibganj ) జిల్లాలోని గుర్జి ఎంజీఆర్ రైల్వే పోల్(Gujri MGR railway line ) సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలు( Bomb Blast ) అమర్చారు.

Jharkhand | రాంచీ : జార్ఖండ్( Jharkhand )లో దారుణం జరిగింది. సాహిబ్‌గంజ్( Sahibganj ) జిల్లాలోని గుర్జి ఎంజీఆర్ రైల్వే పోల్(Gujri MGR railway line ) సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలు( Bomb Blast ) అమర్చారు. పేలుడు ధాటికి పట్టాలు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలిలో మూడు అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. ఈ పేలుడు కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఘటనాస్థలికి చేరుకున్న సాహిబ్‌గంజ్ ఎస్సీ అమిత్ కుమార్ సింగ్ దర్యాప్తు చేపట్టినట్టు మీడియాకు తెలిపారు. ఈ పేలడు వెనుక క్రిమినల్ గ్యాంగ్స్ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ రైల్వే ట్రాక్ ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో భాగం కాదన్నారు. ఈ రైల్వే లైన్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్( NTPC ) ఆధ్వర్యంలో ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పవర్ స్టేషన్‌కు జార్ఖండ్ నుంచి బొగ్గును తరలించేందుకు ఈ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌ను ఎన్టీపీసీ( NTPC )నే నిర్వహిస్తోందన్నారు.
ఈ పేలుడు ధాటికి 470 సెం.మీ. మేర ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. భారీ తీవ్రత ఉన్న పేలుడు పదార్థాలను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరి అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.